
NEE DAYALOO NENUNNA -Sharon Philip,HeavenBabu,JK Christopher LATEST TELUGU CHRISTIAN SONGS 2019
నీ దయలో నేనున్న ఇంతకాలం
నీ దయలో నేనున్న ఇంతకాలం
నీ కృపలో దాచినావు గతకాలం || 2 ||
నీ దయలేనిదే నేనేమందునో || 2 ||
తెలియదయ్యా ......
|| నీ దయలో ||
1. తల్లితండ్రులు - చూపిస్తారు
ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలనీ ఆశిస్తారు
అందనంత గొప్పవారిగా || 2 ||
నీ దయ ఉంటే వారు
కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో
బ్రతుకుట జరుగునా
నీ సిలువ
నీ నీడలో - ననుదాచి ఉంచావని
నా శేష జీవితాన్ని
నీ తోనే గడపాలని
|| నీ దయలో ||
నేల రాలే నా ప్రాణాన్ని
లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు - అంటకుండ దాచావు || 2||
నీ రెక్కల నీడలో
నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దరికి రాకుండా
నీ కృపను తోడుంచుమా
నీ పాదాల చెంతనే
నే పరవశించాలని
నా ఆయువున్నంతవరకు
నీ ప్రేమ పొందాలని
నీ దయలో నేనున్న ఇంతకాలం
నీ కృపలో దాచినావు గతకాలం || 2
||
నీ దయలేనిదే నేనేమందునో || 2 ||
తెలియదయ్యా ......