Halaman

Pages - Menu

Pages

Sunday, January 31, 2021

LATEST NEW TELUGU CHRISTIAN SONGS LYRICS || SANTHOSHAME NA YESUNILO LYRICS || DAVIDSON GAJULAVARTHI || JESUS 2020

LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020 ||

 SANTHOSHAME NA YESUNILO|| DAVIDSON 

GAJULAVARTHI || JESUS




సంతోషమే.. నా యేసునిలో
 
నిత్యానందమునిచ్చు నాధునీలో.. || 2 ||
 
మనసంతా సంతోషం.. || 2 ||
 
ఆత్మలో ఆనందం.. యేసయ్య.... అది దొరికెను నీలో..
 
సంతోషమే నా యేసునిలో
 
నిత్యానందమునిచ్చు నాధునీలో.. || 2 ||
 
 
 
1. శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే 
 
దుఖ:కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే  || 2 ||
 
వ్యదైన బాధైన  నను వీడిపోడు   
 
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు  || 2 ||
 
నను ప్రేమించే నా దేవుడు 
 
నను రక్షించే నా నాధుడు
 
 
 
2. ఏమున్న లేకున్న నీవున్న చాలంతే 
 
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే  || 2 ||
 
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య 
 
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య  || 2 ||
 
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆ ..  
 
చావైతే నీకొరకే యేసయ్య ...   
 
 

 
      

HOSANNA MINISTRIES NEW YEAR SONG LYRICS || GHANAMAINAVI NEE KAARYAMULU LYRICS Full song || 2021

HOSANNA MINISTRIES NEW   

 YEAR SONG 

LYRICS

|| GHANAMAINAVI NEE

KAARYAMULU LYRICS




ఘనమైనవి నీ కార్యములు నా యెడల 
 
 స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
 
 
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి 
 
 స్తుతులర్పించెదను అన్నివేళలా
 
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే 
 
 
 
1. యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
 
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
 
నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
 
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
 
 
 
2. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
 
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
 
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
 
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
 
 
 
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
 
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే
 
నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ
 
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
 
 
ఘనమైనవి.. స్థిరమైనవి..
 
    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
 
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
                

Thursday, January 28, 2021

CHEMMAGILLU KALLALONA Song Lyrics || చెమ్మగిల్లు కళ్ళలోన HEART TOUCHING VIDEO SONG BY BRO. SHALEM RAJU

CHEMMAGILLU KALLALONA

     

పల్లవి:
 
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం 
 
కష్టాల బాటలోనె సాగదు పయనం 
 
విడుదల సమీపించెను 
 
నీకు వెలుగు ఉదయించును 
 
 
 
1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె  

నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె   || 2 ||

నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే  || 2 ||

విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును   || 2 ||



2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
 
           అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే     || 2 ||

           మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే   || 2 ||
 
         విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును    || 2 ||
 
 
 
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం 
 
కష్టాల బాటలోనె సాగదు పయనం 
 
విడుదల సమీపించెను 
 
నీకు వెలుగు ఉదయించును