Halaman

Pages - Menu

Pages

Tuesday, February 28, 2023

Silvalo Nakai Karchenu Yesu Rakthamu Song Lyrics || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs | Siluva Song


పల్లవి:
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము(2)
అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2)


1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము(2)
సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2) || సిల్వలో||


2. సమాధాన పరచును - యేసు రక్తము(2)
సమస్యలను తీర్చునూ - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము(2)
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2) || సిల్వలో||


3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము (2)
దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము(2) || సిల్వలో||



4. రోగములను బాపును - యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలునూ - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము(2) || సిల్వలో||

Saturday, February 25, 2023

MADHILONA NEE RUPAM SONG LYRICS || మదిలోన నీ రూపం - నీ నిత్య సంకల్ప || Hosanna Ministries Songs || Hosanna New Songs || Adviteeyuda - అద్వితీయుడా


                                                         
       

మదిలోన  నీ రూపం  నీ నిత్య సంకల్పం 

ప్రతిఫలింప జేయునే ఎన్నడూ


కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం


వర్ణించలేను స్వామీ నీ గొప్ప కార్యాలను


 నీ సాటి లేరు ఇలలో అధ్వితీయుడా 



1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్ఫూర్తి నీవై 


నడిపించుచున్న నేర్పరి


అలుపెరుగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై 


నను నిలువనీయ్యని వేలలో


హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా


జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై


తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా! యేసయ్యా 


|| మదిలోన  నీ రూపం ||


2.నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే


సంకల్పదీక్షతో సాగేద


నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై


ఆశయాల దిశగా నడిపెనే


నీ నిత్య ఆధారణే అన్నిటిలో నెమ్మదినిచ్చి


నా భారమంత తీర్చి నా సేద తీర్చితివి


నీ ఆత్మ తో ముద్రించితివి నీ కోరకు సాక్షిగా! యేసయ్యా

|| మదిలోన  నీ రూపం ||


3.విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు


స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము


శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్నేతవు


ఆ ఘడియ వరకు విడువకు


నే వేచియున్నాను నీ రాక కోసమే


శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా


నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా


|| మదిలోన  నీ రూపం ||

Thursday, February 23, 2023

Premake Prathi Rupam Lyrics ||New song by #DrSatishKumar | #calvarytemplelive


ప్రేమకే ప్రతిరూపము - నీవే నా ప్రాణము (2 )

నీ ప్రేమే శాశ్వతం - నీ మాటే అమృతం (2 )

నా జీవితం నీకంకితం - నా ప్రియ యేసయ్య


1. నే నడిచే దారిలో - నా తోడువై

నే పీల్చేగాలిలో - నా శ్వాసవై

నీ చేతి నీడలో నన్ను కాచావే

నీ గుండె లోతుల్లో నన్ను దాచావే


2. నన్ను వీడని - నా కన్న తండ్రివి

నన్ను మరువని - నా కన్న తల్లివి
నిన్ను మరచిన - నీ చేయి విడచినా

నన్ను విడువని - యేసయ్య


3. గురిలేని వేళలో - నా గమ్యమై

దరిలేని దారిలో - నా దీపమై

నా చింతలన్నియు - నీవే తీర్చావే

నే కోరిన రేవుకు - నన్ను చేర్చావే



4. నన్ను కోరుకున్న - నా పరమ తండ్రివి

నన్ను విడువనన్న - నా మంచి కాపరి

నీవే నా గురి - నాకున్న ఊపిరి

నీవే నా ప్రాణం యేసయ్య

అందాల చిన్నిగూటిలోన| ANDALA CHINNI GOOTILONA SONG LYRICS #ANDHALACHINNIGUTILONA | 4K SONG #sreshtakarmoji #jonahsamuel



అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను

చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను

ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే

ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ...

లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం

పదిలముగా కాచే - ప్రభువే నా లోకం ||అందాల ||



1. విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు

కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు

పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే... ||అందాల ||



2. పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా

తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా?

శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా.. ||అందాల ||

||VENDI BANGARALU SONG LYRICS|| ( SATHYA SWARUPUDA )VOL 14 THANDRI SANNIDHI MINISTRIES


వెండి బంగారములు నాకు వలదు

పేరు ప్రఖ్యాతలు నాకు వలదు ||2||

ఇహభోగ భాగ్యాలు నాకు వలదు ||2||

సిరిసంపదల ఆశ నాకు లేదు ||2||

నీ పాద సన్నిధే నాకు చాలు ||2||

స్తుతి నీకే నా ప్రభూ ||2||

స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభూ ||2||

స్తుతి నీకే నా ప్రభూ ||2||



1. కమ్మని విందులు నాకు వలదు

క్షణిక ఆనందాలు నాకు వలదు ||2||

కీర్తీ కిరీటాలు నాకు వలదు ||2||

కలల సంచారాలు నాకు వలదు ||2||

నీ దివ్య కౌగిలే నాకు చాలు ||2|| ||స్తుతి నీకే||



2. బంధు బాందవ్యాల బాధ వలదు

బరువు భాధ్యతలన్న భయము వలదు ||2||

నీ మధుర బంధమే నాకు చాలు ||2||

నీవిచ్చు భాగ్యమే నాకు మేలు

నువు మెచ్చు కార్యమే నాకు చాలు

నువు హెచ్చు కార్యమే నాకు చాలు ||స్తుతి నీకే||

||RAJUVINA NAA DEVA SONG LYRICS|| ( SATHYA SWARUPUDA )VOL 14 THANDRI SANNIDHI MINISTRIES


రాజువైన నా దేవా ....
రారాజువైన యేసయ్య... ||2||
కోటి స్వరముల స్తుతించిన ||2||
తనివి తీరదు నా మనసున ||2||
ఆరాధన స్తుతి ఆరాధన.... ||6|| ||రాజువైన||



1. కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా ||2||
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ ||2|| ||ఆరాధన||

2. నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము .... ||2||
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము ... ||2|| ||ఆరాధన||


3. మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము ||2||
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము ||2|| ||ఆరాధన||

Monday, February 6, 2023

Langaresinaava Na Navaku Song Lyrics/అనేకులను కంటతడి పెట్టిస్తున్న పాటINew telugu christiansong/sis.KanthiKala


లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక

1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు ||అలలను అదిమిపెట్టి ||


2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు (2)

ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు ||అలలను అదిమిపెట్టి ||


3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు ||అలలను అదిమిపెట్టి ||