Halaman

Pages - Menu

Pages

Friday, March 31, 2023

Samanulevaru Prabho Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Song Lyrics



సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)

సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల ||సమానులెవరో||

1. సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప ||సమానులెవరో||

2. పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా ||సమానులెవరో||

3. దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ ||సమానులెవరో||

4. ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత ||సమానులెవరో||

Prardhana Vinedi Pavanuda Song Lyrics | Jesus Telugu Christian Songs || Christian Old Songs Lyrics


ప్రార్థన వినెడి పావనుడా

ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||



1. శ్రేష్టమైన భావము గూర్చి

శిష్య బృందముకు నేర్పితివి

పరముడ నిన్ను ప్రనుతించెదము

పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||



2. పరమ దేవుడవని తెలిసి

కరము లెత్తి జంటగా మోడ్చి

శిరమునువంచి సరిగను వేడిన

సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||



3. దినదినంబు చేసిన సేవ

దైవ చిత్తముకు సరిపోవ

దీనుడవయ్యి దిటముగా కొండను

చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||



4. శత్రుమూక నిను చుట్టుకొని

సిలువపైన నిను జంపగను

శాంతముతో నీ శత్రుల బ్రోవగ

సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

Rajulaku Rajaina Song Lyrics || Andhra Kraisthava Keerthanalu ||Christian Old Songs


రాజులకు రాజైన ఈ మన విభుని

పూజ చేయుటకు రండ

ఈ జయశాలి కన్నా

మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు||



1. కరుణ గల సోదరుండై ఈయన

ధరణికేతెంచెనయ్యా (2)

స్థిరముగా నమ్ముకొనిన

మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు||



2. నక్కలకు బొరియలుండే నాకాశ

పక్షులకు గూళ్లుండెను (2)

ఒక్కింత స్థలమైనను

మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||



3. త్వరపడి రండి రండి ఈ పరమ

గురుని యొద్దకు మీరలు (2)

దరికి జేరిన వారిని

ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||

Oranna Oranna Song Lyrics | Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics



ఓరన్న… ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా

యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||



1. చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా

పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)

అద్వితీయుడు ఆదిదేవుడు

ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||



2. పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా

నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)

పరిశుద్దుడు పావనుడు

ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న||



3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా

మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)

మహిమ ప్రభూ మృత్యుంజయుడు

క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న||

Randi Utsahinchi Padudamu Song Lyrics || Christian old Songs Lyrics ||Andhra Kraisthava Keerthanalu


రండి ఉత్సాహించి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే (2)



1. రండి కృతజ్ఞత స్తోత్రముతో

రారాజు సన్నిధికేగుదము (2)

సత్ప్రభు నామము కీర్తనలన్

సంతోష గానము చేయుదము ||రండి||



2. మన ప్రభువే మహా దేవుండు

ఘన మహాత్యము గల రాజు (2)

భూమ్యాగాధపు లోయలును

భూధర శిఖరములాయనవే ||రండి||



3. సముద్రము సృష్టించెనాయనదే

సత్యుని హస్తమే భువిజేసెన్ (2)

ఆయన దైవము పాలితుల

ఆయన మేపెడి గొర్రెలము ||రండి||



4. ఆ ప్రభు సన్నిధి మోకరించి

ఆయన ముందర మ్రొక్కుదము (2)

ఆయన మాటలు గైకొనిన

అయ్యవి మనకెంతో మేలగును ||రండి||



5. తండ్రి కుమార శుద్దాత్మకును

తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)

ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూc

అయినట్లు యుగములనౌను ||రండి||

Kadhilindhi Karuna radham Song Lyrics|| Siluva Songs || Good Friday Songs


కదిలింది కరుణ రథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే... మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపథం
కదిలింది కరుణరథం...


1. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది
పరిశ ద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది
దీనజనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాప క్షమాపణ పొందిన హృదయాలు
నిలువునా కరిగీ నీరయ్యాయి నీరయ్యాయి
నాయనలారా నాకోసం ఏడవకండి మీకోసం
మీకోసం పిల్లలకోసం ఏడవండి


2. ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్ళకిరీటమయ్యిందీ
ప్రేమ సేవ త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది
తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా ఛెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు
చెల్లాచెదరై కుమిలాయి
చెల్లాచెదరై కుమిలాయి


3. పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగ మారాయి...
అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరి రాళ్ళు
కలవరపడి కలవరపడి కలవరపడి అరిచాయి అరిచాయి

Thambura Sitharatho Song Lyrics || Christian Old Songs Lyrics


తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||


1. పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||


2. ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||

Dinamella Ne Padina Song Lyrics || Telugu Christian Songs with Lyrics || Christian old Songs Lyrics

దినమెల్ల నే పాడినా


దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||


1. గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల||


2. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని ||దినమెల్ల||

Paradeshi o Paradeshi Song Lyrics || Christian old Song Lyrics || Pastor K.Rajababu Song Lyrics



ఎటుచూసినాఎడారులే

ఎండిపోయినాఎండమావులే

ఏనాటికైనాఈ కాయము

మాయమగుటే ఖాయము

ఈ నాటికైనా యేసయ్యను

చేరుకోనుటేన్యాయము

యేసు రక్తమే జయము }

సిలువ రక్తమే జయము } ||4||



1. కట్టుకున్నభార్య నీపై కుప్పలా కూలినా }

కన్నబిడ్డలకన్నీరు ఏరులై పారినా } ||2||

అన్నదమ్ములే నీకై కలవరించినా

అలమటించినా…..

బంధువులంతాబ్రతిమాలినా

ఆత్మీయులేఅడ్డగించినా…|| ఏనాటి ||

2. ఫ్యాక్టరీలుఉన్న మోటరు కారులెన్నిఉన్నా }

పొలాలెన్నిఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా } ||2||

అందగాడివైనా ఆటగాడివైనా

అందని మాటకారివైనా

సిపాయివైనాకసాయివైనా

బికారివైనాఏకాకివైనా || ఏనాటి ||


3. తెల్లవాడివైనాతెలిసిన నల్లవాడివైనా }

నాయకత్వమున్నఎంతటి ప్రేమతత్వమున్న } ||2||

విద్యావేత్తవైనా…తత్వవేత్తవైనా…

ఎంతటి శాస్త్రవేత్తవైనా…

థీయిస్టువైనాఎథిస్టువైనా

మార్కిస్టువైనాకోపిష్టివైనా || ఏనాటి ||

SRIKARUNDA SRIYESUNADHA SONG LYRICS | Ps.Jyothi Raju Song Lyrics | Telugu Christian Song Lyrics | Live Worship |



శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా

హొసన్నా . . హల్లెలూయా . . (2)



1. పాపభారం భరియించినావు పాపినైన నా కొరకెగా (2)

పవిత్రతతో నీపాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో (2)



2. మరణపు ముల్లును విరచి నీవు మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2)

మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను (2)


3. ఆశీర్వాదము నిచ్చెడివాడా ఆందుకో మా స్తుతిమాలిక (2)

ఆప్తుడవై నను ఆదరించి అభిషేకముతో నింపితివి (2)

E Thegulu Nee Gudaramu Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics


ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా

అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)

లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా

లలల్లాలాలల్లా లలల్లా (2)



1. ఉన్నతమైన దేవుని నీవు

ఆశ్చర్యమైన దేవుని నీవు

నివాసముగా గొని

ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||



2. గొర్రెపిల్ల రక్తముతో

సాతానున్ జయించితిని

ఆత్మతోను వాక్యముతో

అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||



3. మన యొక్క నివాసము

పరలోక-మందున్నది

రానైయున్న రక్షకుని

ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||