Halaman

Pages - Menu

Pages

Saturday, April 29, 2023

Yesu neeve kavalaya Song Lyrics I Pr. Dr. Philip Jacob || Latest Worship Songs || PAG Vijayawada


యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా || యేసు ||

1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2 || నీవే ||

2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2 || నీవే ||

3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2 || నీవే ||

Priyuda Nee Prema Song Lyrics || ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి || Melodious Song by Dr. PHILIP P JACOB.



1.
ప్రియుడా నీ ప్రేమ – పాదముల్  చేరితి - నెమ్మది నెమ్మదియే
 ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే  అద్భుతమే  ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2)


2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా  మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా  మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)
3. బలియైన గొఱ్ఱెగా -  పాపములన్నిటిని మోసి తీర్చితివే  పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా  పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా
4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా  రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం  నిశ్చయమే

 రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా

Yesu nanna Yesu nanna Song Lyrics || యేసు నాన్న యేసు నాన్న || Dr. Philip P Jacob || Philadelphia AG Church.



యేసు నాన్న యేసు నాన్న యేసు నాన్న
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధనా ఆరాధనా యేసయ్య కు ఆరాధనా


1. ధవళ వర్ణుడ రత్నవర్ణుడ
పడివేలమందిలో అతీసుందరుడా
|| ఆరాధనా ఆరాధనా ||


2. తల్లిమరచిన తండ్రివిడిచిన
నీవునన్ను విడువలేదయా

|| ఆరాధనా ఆరాధనా ||


3. చీకటిలోన నే నుండగా
వెలుగైనావే నన్ను వెలుగించావే

|| ఆరాధనా ఆరాధనా ||

4. అర్హతలేని నా జీవితన
పరిశుద్దాత్మ నిచ్చి నడిపించావే

|| ఆరాధనా ఆరాధనా ||



5. పనికి రాని పాత్రను నేను
పరిమళ వాసనగా నను చేశావే

|| ఆరాధనా ఆరాధనా ||

Melulu Nee Melulu Song Lyrics||Melulu ni melulu song lyrics || Dr. PHILIP P JACOB || Philadelphia AG Church ||


మేలులు నీ మేలులు


మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2)
నా ప్రానమున్నంత వరకూ విడిచిపొలెనయ్యా (2)
మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2)


1. కొండలలో ఉన్ననూ నీవు మరిచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ నీవు విడిచిపొలెదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా

గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా(3) ||మేలులు||


2. అగ్నిలో ఉన్ననూ నేను కాలిపొలెదయ్య
జలములలొ వెళ్లినా నేను మునిగిపొలెదయ్యా(2)
నీది పావురము మనసయ్యా యేసయ్యా

పావురము మనసయ్య (3) ||మేలులు ||



3. చీకటిలో ఉన్ననూ నన్ను మరచిపొలెదయ్యా
దుఃఖములో ఉన్ననూ

మంచి స్నేహితుడవయ్యావయ్యా(2)
నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా
ప్రేమించే మనసయ్యా(3) ||మేలులు ||

Gunde Ninda Yesu Unte Song Lyrics || Dr. PHILIP P JACOB || Telugu Christian Song.





హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా...
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే



1. లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే

|| గుండెనిండానువ్వే ||

2. ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి

|| గుండెనిండానువ్వే ||
3. చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం

|| గుండెనిండానువ్వే ||

Monday, April 24, 2023

Chala Chala Manchi Vaadu SOng Lyrics|| - చాలా చాలా మంచి వాడు||Praise Song with Tamil, Marathi, Hindi Chorus

Chala Chala Manchivadu

Chala Chala Manchivadu
Rombo Rombo Nallavar Yesu Chala Chala Manchivadu Na Yesaiya
Chala Chala Manchivadu


Verse 1
Nannu Vedhki Vacchavu
Nannu Preminchavu
Nee Pranamunicchi
Nannu Rakshinchavu Rombo Rombo Nallavar Yesu
En Yesappa
Rombo Rombo Nallavar Yesu Chala Chala Manchivadu Na Yesaiya
Chala Chala Manchivadu

Verse 2
Nannu Ennukunnavu
Adhikaram Icchavu
Naa Thodai Undi
Naaku Jayamuni icchavu

Tamil Rombo Rombo Nallavar Yesu
En Yesappa
Rombo Rombo Nallavar Yesu


Marathi Changla Changla Majha Yeshu Majha

Yeshua Khup Khup Changla Yeshu


Hindi Accha Accha Mera Yeshu Mera

Yeshua Accha Accha Mera Yeshu


Telugu Chala Chala Manchivadu Naa Yesaiya ... Chala Chala Manchivadu

KRUTHAGNATHATHO SONG LYRICS - SAMARPAN D WORSHIP BAND'S SINGLE VIDEO | WORSHIP SONG LYRICS



కృతజ్ఞతతో స్తుతి పాడెద


కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)


1. అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||


2. నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||