Halaman

Pages - Menu

Pages

Wednesday, May 31, 2023

Devudichina divya vakyami Song Lyrics || Old Christian Telugu Songs || Andhra Kraisthava Songs || V.K.Henry Songs

దేవుఁ డిచ్చిన దివ్యవాక్య

Singer: C.Ramana

Lyrics : Purushottam choudhary

Music : V.K.Henry 




దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను
 మన కో యన్నలారా 

భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు 

||దేవుఁ డిచ్చిన||



1. భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ 

దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని 

బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||



2. సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును

 బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ 

నుండును ||దేవుఁ డిచ్చిన||



3. ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు 

దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు 

||దేవుఁ డిచ్చిన||



4. పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు 

రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని 

శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||



5. దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న 

వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ 

కిపుడె ||దేవుఁ డిచ్చిన||



6. మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు

 పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము 

||దేవుఁ డిచ్చిన||



7.
నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు

 ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము 

||దేవుఁ డిచ్చిన||



8. మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష 

కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు 

||దేవుఁ డిచ్చిన||

Nannu Gannayya Rave Song Lyrics || Old Christian Telugu Songs Lyrics || Andhra Kraisthava Keerthnalu || V.K. Henry Songs

Singer: C.Saritha

Lyrics : Purushottam choudhary

Music : V.K.Henry 


నన్ను గన్నయ్య రావె నా యేసు

నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||



1. ముందు నీ పాదారవిందము

లందు నిశ్చల భక్తి ప్రేమను (2)

పొందికగా జేయరావే నా

డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||



2. హద్దులేనట్టి దురాశల

నవివేకినై కూడి యాడితి (2)

మొద్దులతో నింక కూటమి

వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||



3. కాలము పెక్కు గతించెను

గర్వాదు లెడదెగవాయెను (2)

ఈ లోకమాయ సుఖేచ్ఛలు

చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||



4. దారుణ సంసార వారధి

దరి జూపి ప్రోవ నీ కన్నను (2)

కారణ గురువు లింకెవ్వరు

లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||



5. నా వంటి దుష్కర్మ జీవిని

కేవలమగు నీదు పేర్మిని (2)

దీవించి రక్షింపనిప్పుడే

రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||

Na Kanula Vembadi Kanniru Song Lyrics| Chirunavvutho Nimpina Yessaya Song Lyrics| Ps Enosh kumar | Cover Song | Bethel church Vij | New Telugu Christian Songs

నా కనుల వెంబడి


నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4)   ||నా కనుల||


1. అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)    

 ||చిరునవ్వుతో||


2. సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)        

||చిరునవ్వుతో||

Ye Bhayamu Song Lyrics | Latest Telugu Worship Song | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson

ఏ భయము


ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ||2||
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||



1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా ||2||
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||


2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా ||2||

నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా||2||

ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||

Wednesday, May 24, 2023



పల్లవి: ఓ అన్నలారా! దేవుడు మనకు ఇచ్చిన

దివ్యమైన మాటలు ఈ బైబిలు, మనసును శుద్ధిచేసే

గొప్పశుభమైన సమాచారం ఈ బైబిలే.



1. భయముతో, భక్తితో దీనిని చదివిన యేసు
మనకు ఆశ్రయం అని తెలుపుతుంది.

దయగలిగిన దేవుడే
మన తండ్రి అని బోధించును.



2. బైబిల్ను చదివితే సత్యము,

శాంతము మనకు లభిస్తాయి.

మంచి పనులకు ఫలితము లభిస్తుంది.

నిస్సందేహంగా నిత్యజీవము లభిస్తుంది.



3. ఆశీర్వాదము ఇచ్చే ఆ బైబిల్ను

మీరు అనుసరించండి.

మీ పాపములను వదలి పరలోకం వెళ్లే దారి

తెలుసుకోవాలని అనుకొనేవారు దానిని అనుసరించండి.



4. పాపపు పనుల నుండి విడుదల పొందితే సుఖంగా

ఉండవచ్చును అని. తలంచితే మీ కోరిక బైబిల్
తీరుస్తుంది. వెంటనే రండి.

యేసును అంగీకరించండి.



5. పాప రుణములను తీర్చుటకు మధ్యవర్తి కావాలంటే

త్వరగా యేసు వద్దకు రండి. దయామయుడగు

యేసు చెంతకు రండి.


6. మరణమునకు భయపడేవారు పరమ శాంతిని

ఇచ్చే యేసు దగ్గరకు వేగంగా రండి.



7. పాపపు ఆలోచనలు లేని మనసు కావాలని నిజంగా

ఆశించేవారు మంచి హృదయంగల యేసు నొద్దకు

వేగంగా రండి.


8. పరలోక రాజ్యము చేరాలని కోరిక ఉన్న వారు

రక్షకుడైన యేసు నొద్దకు విశ్వాసముతో రండి.

Thursday, May 18, 2023

Unna Patuna Vachuchunnanu Song Lyrics || AndhraKraisthavaKeerthanalu || Sri purushottam choudhary songs || V.K.Henry Songs


ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా

ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి

యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను

నన్ను దయగను ||ఉన్న||



1. కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ

శ-రీర రక్తము చిందుట

భూరి దయతో నన్ను నీ దరి – జేర

రమ్మని పిలుచుటయు ని

ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు

నా యెడ ||ఉన్న||



2. మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె

దో-ష సమూహములు మచ్చలై

అసిత మగు ప్రతి డాగు తుడువను –

గసుటు గడిగి పవిత్ర పరపను

అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ

నిదె గని ||ఉన్న||



3. వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము

– కలిగె నెమ్మది దొలాగెను

పలు విధములగు సందియంబుల

– వలన పోరాటములచే నే

నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో

నిదె ||ఉన్న||



4. కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను

చెడిపోయి పడియున్నాను

సుడివడిన నా మదికి స్వస్థత –

చెడిన కనులకు దృష్టి భాగ్యము

బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ

యడా యిదె ||ఉన్న||



5. నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి

– జీవ మార్గము గంటిని

కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని

భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని

యిదె ||ఉన్న||


6. దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ

– తరమే వర్ణన చేయను

తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు

డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము

నీ వాడ నవుటకే ||ఉన్న||

Wednesday, May 17, 2023

Manasaanandamu Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || V.K.Henry Songs


మనస్సు ఆనందమ

Singer: Dr. Banti

Lyrics : Purushottam choudhary

Music : V.K.Henry 


పల్లవి: మనస్సు ఆనందము పొందుట కంటే

మరి ఏ భాగ్యము కలదు?

ఇక అఖిల సుఖములు రోజుకు ఒక
రీతిగా గడియకు ఒక తీరుగా ఉంటాయి.



1. ధైర్యముగా ప్రార్ధన అను ఖడ్గము పట్టి,

తిరుగు పిసాచము భయపడునట్లు

మంచి కాంతిగల ప్రభువు

చెప్పిన శాస్త్రపు మాటలు, సూక్తులు,

పెక్కు సంశయము అను బురదను తీసివేయును.

అనుమానము పటాపంచలగును.



2. మంచివారు క్రైస్తవ సాంగత్యము

చేస్తే ఎంతో మేలు కదన్నా!

శోధనలన్నిటినీ ధైర్యముగా ఎదుర్కొను
మంచి మనసు కంటెను ఇంక సుఖము ఏమున్నది ?



3. మనస్సున నేను అను అహంకారము కలవానికి

తగిలే చెడ్డతనము తెలిసి రావలెనన్నా! రక్షకుని

సిలువను చూచి మిక్కిలి విశ్వాసము కలిగి ఉండాలి.



4. ప్రభువు నొద్ద క్షమయు, స్నేహము నేర్చుకుంటే

మనకు శత్రువులు ఇక భూమియందు ఉండరన్నా!

సమదృష్టితో భూజనులులను తెలుసుకొనుట

మంచిక్రైస్తవులు అనుసరించ దగినది.


5. పరమ దయానిధి అయిన క్రీస్తుని బలము చేత

పాపపు మూటలు తొలగిపోవును. పరిశుద్ధాత్ముని

సంబంధముతో ఎటువంటి తేడాలు లేక చిన్న

పాటి చీకటి తెరలన్నియు తొలగిపోవును.

Sakalendriyamulara chala mi pani Song Lyrics || V.K. Henry Songs || Andhra Kraisthava Keerthanalu

సకలేంద్రియములారా

 Singer: C. Ramana

Lyrics : Purushottam choudhary

Music : V.K.Henry


సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిఁక నన్ను విడిచిపోవు

టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని

మీ రి క దొలంగుఁడు యేసు నా ర క్షకుఁడు వచ్చెను నన్ను గావను

||సకలేంద్రియములారా||



1. పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ

వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు ద లఁచి చూడుఁడు దేవ

కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి

||సకలేంద్రియములారా||



2. శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి

విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి

పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది

||సకలేంద్రియములారా||



3. కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో

ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన

మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ

జూడుఁడు ||సకలేంద్రియములారా||



4. రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి

నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని

వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద

||సకలేంద్రియములారా||



5. తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి వ

న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా

వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప

బోయెద ||సకలేంద్రియములారా||



6. ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ

బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక

నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును

||సకలేంద్రియములారా||



7. కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ

నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు

గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ

గావను ||సకలేంద్రియములారా||



8. వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ

కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు

చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద

||సకలేంద్రియములారా||



9. ఈ సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని

యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు

నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస

మిత్తురు ||సకలేంద్రియములారా||