Halaman

Pages - Menu

Pages

Thursday, April 18, 2024

Kristhesuva Naa Priya Nayakuda Song Lyrics |Telugu Christian Medley I David Parla ft Samuel Dhinakaran,Hanok Raj

క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా


క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే

క్షణమోనా కన్నీరు తుడచుటకు – నన్నాదరించుటకు
నా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము ॥క్రీస్తే॥ 1.మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ

నా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకు
నీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్ ॥క్రీస్తే॥


యేసయ్య నా యేసయ్యా
నా శ్వాసయే నీవయ్యా
యేసయ్య నా యేసయ్యా
నా సర్వము నీవేనయ్య (2)



పర్వతములు తొలగిపోయిన
మెట్టలు తత్తరిల్లనా
మారనిది నీ ప్రేమయే
తరగనిది నీ ప్రేమయే


ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం

ADBHUTHAM CHEYUVAADAA SONG LYRICS|JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND|BLESSY GODWIN|SAREEN IMMAN|TELUGU WORSHIP


అద్భుతం చేయువాడా


అద్భుతం చేయువాడా - అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా - నా యేసు రాజా నీవే ( 2 ) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||


1. పేతురు దోనెలో ఉన్నవాడా - నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 ) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||


2. నీటిని గోడగా నిలుపువాడా - ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి - నాలోన అద్భుతము చేయువాడా ( 2 ) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||

Ninu Vidachi Undalenayya Song Lyrics | Lillian Christopher I NagaRaju | Suresh | Latest Christian song 2024

నిను విడచి ఉండలేనయ్యా



యేసయ్యా...
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా..... నిను విడచి ఉండలేనయ్యా...
నీ ప్రేమను మరువలేనయ్యా... (2)
నను ప్రేమించెను...
నను విడిపించెను...
నను దీవించెను...
నను బ్రతికించెను...
అనుక్షణము...రక్షించెను
యేసు - నన్ను
అనుక్షణము... రక్షించెను
నా దేవుడు - గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
(నిను విడచి)



1. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము - కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను....
( నా దేవుడు)



2. నిందలతో నన్ను క్రుంగదీసినా...
మాటలతో నన్ను గాయపరచినా... (2)
నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు
నా గాయము స్వస్థ పరచెను..
( నా దేవుడు)



3. కన్న వారే నన్ను విడిచి వేసినా
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2)
నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు
అను నిత్యము నాతో ఉండెను.

( నా దేవుడు)

AMMA CHUPALEDHU SONG LYRICS ll Latest Christian Telugu Song Lyrics | THANDRI SANNIDHI MINISTRIES ll

అమ్మ చూపలేదు


అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”


1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”


2. నీదు ప్రేమ బంధము విడిచి – నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

” అమ్మ చూపలేదు”

Parama Thandri Song Lyrics| Nenu Nadiche Dharulalo Song Lyrics| Gyan Swaroop, Joel Johnson & Angela | Merge Music | New christian song 2024 |


నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము - 2


పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము
రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము


స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము
అక్కరలు అన్నీయు తీర్చు వాడవు - 2


పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును
భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము

Monday, April 1, 2024

ADHAARAMA NAA YESAYYA SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Deva Priya | Telugu Christian Songs 2024 lyrics

ఆధారమా నా యేసయ్య


ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన


1. ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే ఓటమైన - ఒంటరైన
కరుణ చూపి - నడిపినావు వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా


2. నీదు వదనం - కాంతి కిరణం
కనులలోని - ప్రేమ మధురం ఎదురు చూసే - జీవ గమనం
బదులు పంపే - సిలువ రుధిరం కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా

Neeve Neeve Song Lyrics| John Vittney - Neeve Deva (Feat. Allen Ganta, Queen Erusha, Bobby Joe) | Christian Worship Song | 4k

నీవే దేవా


 నీవే నీవే

పాపిగ నను చూడలేక పాపముగా మారినావా

దోషిగా నను చూడలేక నా శిక్ష నీవు పొందినావా (2)


నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే

అర్హత నాకిచ్చుటకు అవమాన మొందితివే

తండ్రితో నను చేర్చుటకు విడనాడబడితివే

జీవము నాకిచ్చుటకు మరణమునొందితివే


నీవే నీవే నీవే దేవా

నీవే నీవే నా యేసయ్య (2)


పరమును వీడి ఈ భువికి దిగివచ్చిన రక్షకుడా

మహిమను వీడి నా వెలని చెల్లించిన  ప్రేమామయుడా

నే వెదకి రాలేనని సత్యమునెరిగి నీవే నా దరికి పరిగెత్తితివి

దాసత్వము నుండి నను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి


ఓ... నీవే నీవే నీవే దేవా

నీవే నీవే నా యేసయ్య (2)


 నా స్థానంలో నీవే నిలచి నీ స్థానమే నాకిచ్చితివి

సౌందర్య వంతునిగా నన్నే చేసి, సొగసంత కోల్పోయితివి 

నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి

ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి


ఓ... నీవే నీవే నీవే దేవా

నీవే నీవే నా యేసయ్య (2)


నా బలమంతా నీవే నా సౌందర్యం నీవే

నా ఐశ్వర్యము నీవే, నీవే నీవే

నా అతిశయము నీవే నా ఆనందం నీవే

నా ఆధారం నీవే, నీవే నీవే (2)


యేసయ్య యేసయ్య యేసయ్య

యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) || పాపిగ ||