Halaman

Pages - Menu

Pages

Tuesday, August 27, 2024

MAHIMA Song Lyrics |Mahima a eka namamuku song lyrics| Glory to the name of Jesus Song Lyrics | The Worship Studio Season 3 | Blessy Simon ft Merlyn Salvadi, Kenny Salvadi



మహిమ


Glory to the name of Jesus

Glory to the one and only name
Glory to the king of kings
Glory to God forever Amen



1. అధికారం కలిగున్న నీ నామము
పాపిని రక్షించు నీ నామము
సంకెళ్లు విడగొట్టు నీ నామము
నను లేపి నడిపించు నీ నామము మహిమ యేసయ్యా నామముకు


ఆ ఏక నామముకు
మహిమ రాజుల రాజుకు
మహిమ ప్రభుకెల్లప్పుడు ఆమెన్



2. శోధకుని బంధించు నీ నామము
చీకటిని తొలగించు నీ నామము
అలజడిని గద్దించు నీ నామము
విజయమును దయచేయు నీ నామము
||మహిమ||

3. కరములెత్తి నిన్ను కొనియాడెదన్
గీతములతో నిన్ను ఘనపరిచెదన్
ప్రతి శ్వాసతో నిన్ను స్తుతియించెదన్
స్వరములెత్తి నిన్ను స్తోత్రించెదన్
||మహిమ||


Bridge:-
రక్షణ నిచ్చు నామము
స్వస్థత నిచ్చు నామము
విడుదల నిచ్చు నామము
నా యేసు నామము
అతి శ్రేష్టమైన నామము
ఉన్నతమైన నామము
జీవమిచ్చు నామము
నా యేసు నామము ||మహిమ||

Nee Krupa Lenide Song Lyrics|| Latest Telugu Christian Worship song 2024 || Eli moses


నీ కృపాలేనిదే


నీ కృపాలేనిదే నేను లేను ప్రభు
నీ కృపవల్లనే నాధు జీవం ప్రభు ||2|| విడువధు ఎడబాయాధు.....
నీ కృపా నను ఎన్నడు..... ||2|| నీ కృపా చాలును నీ ప్రేమ మరువను
నీలో నే ఆనందము......
నీ తోడు మరువను స్నేహం విడువను
నీతోనే నా విజయము......

1. నేరవేర్చెదవు ప్రతి వాగ్ధానము
నీ కృపతో నీ సాక్షి గా నడిపించెదవు ||2||

|| విడువధు||
2. నీ ఆత్మతో నను నింపుము
నీ సాక్షిగా నను వాడుము ||2||
|| విడువధు||

Sthuthiyu Mahima Ghantha Neeke Song Lyrics| Telugu Christian Songs | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu



స్తుతియు మహిమ ఘనత నీకే

యుగయుగముల వరకు

ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు||



1. మా దేవుడవై మాకిచ్చితివి

ఎంతో గొప్ప శుభ దినము (2)

మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)

కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)

||స్తుతియు||



2. నీవొక్కడవే గొప్ప దేవుడవు

ఘనకార్యములు చేయుదువు (2)

నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)

నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)

||స్తుతియు||



3. నీవే మాకు పరమ ప్రభుడవై

నీ చిత్తము నెరవేర్చితివి (2)

జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)

నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)

||స్తుతియు||



4. భరియించితివి శ్రమలు నిందలు

ఓర్చితివన్ని మా కొరకు (2)

మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)

పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)

||స్తుతియు||

Na Pranamaina Yesu Song Lyrics |Na pranamai na pranamai song lyrics | Telugu Christian Song | Jesson Kurian

నా ప్రాణమైన యేసు


నా ప్రాణమై
నా ప్రాణమై నా ప్రాణమైన యేసు
నా ప్రాణముతోనే కలిసి నా ప్రాణమా

నే నిన్నే స్తూతియింతు.(2)


1. లోకమంతా క్షణికమయ్యా....

నీ ప్రేమయే నాకు స్థిరమయ్యా (2)
నీ నామము కీర్తించెదను ...

యేసయ్య నిన్నే నే ఘనపరిచెదను రాజా
నీ నామము కీర్తించెదను యేసయ్య

నిన్నే నే ఘనపరిచెదన్ || నా ప్రాణమైన||

2. పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకం చేయుమయ (2)
నీ కొరకే జీవించెదను యేసయ్య

నీ కొరకే మరణించేదెను రాజా
నీ కొరకే జివించెదను యేసయ్య

నీ కొరకే మరణించెదను || నా ప్రాణమైన||

Ye manchileni na brathukulo Song Lyrics| Telugu Christian New Song 2022 | Sis P Daivakumari

ఏ మంచిలేని నా బ్రతుకులో



ఏ మంచిలేని నా బ్రతుకులో
ఇంతగా నీవు ప్రేమించావు
ఆదరణ లేక తిరుగుచుండగా
ఆదరించి నావేసు అద్వితీయుడా
మరువలేను యేసయ్య నీ ప్రేమను
విడువలేను యేసయ్య నీ స్నేహము
ఊహకందదయ్య నీ త్యాగము ||2|| ౹౹ఏమంచి౹౹

1. అపోస్తుల బోధ యందును
సహవాస మందు రొట్టె విరిచె యందు 2
ఎడతెగని ప్రార్థన నాకు నేర్పుయ్య 2
౹౹ఏ మంచి లేని౹౹

2. నశియించిపోతున్న ఆత్మల రక్షణకై
కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్య 2
ఆ ప్రార్థనే నా బలము యేసయ్య 2
౹౹ఏ మంచి లేని౹౹

3. మహిమ నుండి నన్ను అధిక మహిమతో
నన్ను నింపయ్య నా యేసయ్య. 2
నీ ప్రార్దేక్షతలో నన్ను నడుపుము. 2
౹౹ఏ మంచి లేని౹౹

Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics| Uhinchani Karyamulu chuchedanu Song Lyrics | Vinod Kumar, Benjamin Johnson, David Parla, Kiran Abdias.

ఊహించని కార్యములు చూచెదను



ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
నా యేసు నాపై చేయుచున్నాడు
చేయుచున్నాడు చేయుచున్నాడు
అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు

1. ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా
ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా
ఏ సమయమందైనను చింత లేదుగా
విస్తారమయిన కృప ఉండగా
కృప ఉండగా కృప ఉండగా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా

2. ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా
నీ ప్రేమను చూప భువికి వచ్చినావయా
నా పాపమంత సిలువలో మోసినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
ఇచ్చినావయా ఇచ్చినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
ఏలుచున్నాను ఏలుచున్నాను
విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను
ఏలుచున్నాను ఏలుచున్నాను
నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను

Friday, August 23, 2024

Enthaina Nammadagina Deva Song Lyrics || Dr. Asher Andrew || The Life Temple|| Latest Christian Telugu Song Lyrics 2024

ఎంతైనా నమ్మదగినా దేవా


ఎంతైనా నమ్మదగినా దేవా ఎంతైన నిన్ను ఆరాధించెదా
అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది
అందుకే మేము ఇంకా లయము కాలేదు


1. మాటి మాటికి నీదు గాయము నేను రేపిన
దినదినము నాదు క్రియలతో నిన్ను విసిగించినా
నీదు నమ్మకత్వమే నన్ను శుద్ధుని చేసెను

2. నమ్మదగని వారిగా మేము ఉండగా
నీదు వాగ్ధానంబులన్ మాకునిచ్చితివే
నీదు నమ్మకత్వమే వాటిని నెరవేర్చెను

3. పిలుచువాడు నమ్మదగిన దేవుడైయున్నాడు
సహవాసమునకు మమ్ము పిలచి స్థిరపరచితివే
నమ్మకముగా ప్రేమించి నిన్నే సేవింతుము

Nee Snehamu Song Lyrics | Good Friday Songs In Telugu 2024 Lent Days song|Good FridaySong |JesusChanan|

విలువైన రక్తము


నీ స్నేహము నను మనిషిని చేసింది
నా హృదయముకు ప్రేమించుట నేర్పింది
విలువైన రక్తము నా కొరకు ధారపోసి
నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.
ప్రేమమయుడా ,సర్వోన్నతుడా,

మహిమాన్వితుడా, నా యేసయ్య ||2||
|| నీ స్నేహము ||

1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2||
నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు

|| ప్రేమమయుడా ||
|| నీ స్నేహము ||

2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని

నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2||
నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి

నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు

|| ప్రేమమయుడా ||
|| నీ స్నేహము ||


3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2||
కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు

|| ప్రేమమయుడా ||
|| నీ స్నేహము ||