Halaman

Pages - Menu

Pages

Friday, May 16, 2025

Mataichina Devudu Song Lyrics | Ps.David Varma | The New Life Church | Latest Christian Telugu Song 2025

మాట ఇచ్చిన దేవుడు


మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా
నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించకమనున
నీ కన్నుల పొంగిన కన్నీరు తనకవిలలో దాచిన దేవుడు
నీ పగిలిన హృదయపు వేదమను మరచిపోవునా
నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమేగా
చితికిన నిస్థితిలో చిరునవ్వుతో నింపునుగా

    
1. ఆస్తి ఎంతో ఉన్నను - వారసూడే లేక
వేదనతో నిలిచిన అబ్రహమును చూడము
ఆశలే కోల్పోయి - శరీరమే ఉడికిన -

అవమానాలెన్నో ఎదుర్కొన్నాను
మాట్లాడే దేవుడే - మౌనముగా నిలిచేనా
ఎండిన స్థితిలో - జీవముతో నింపేగా
వెచ్చిఉన్న దినములు వ్యర్థములైపోయేన
లెక్కకు మించిన సంతానమును పొందెగ


2. కుటుంబమే ఉన్నాను - కుటికే కరువై
వేశ్యగా నిలిచిన రహాబును చూడుము
అడుగడుగున అవమానాలే - గుండెలో గాయాలై
అవసరానికే అటబొమ్మగ మిగిలిన
చూచుచున్న దేవుడే చులకనగా చుచేన
ఘోరపాపివంటు విడచిపోలేదుగా
పరిశుద్దుని వంశములో స్థానమునే ఇచ్చేనుగా
ఘోరపాపి అయిన తనప్రేమతో కడిగేనుగా


3. వాగ్దానమే ఉన్నాను - పయనమే భారమై
ఎడారిలో నిలిచిన మోషను చూడము
శత్రువే తరిమిన సంద్రమే ఎదురైనా
ఏదారోతెలియక పయనమే ఆగినపయనమే అగిన
ఇజ్రాయెల్ దేవుడే ఇరుకున విడిచేన
మహిమనే చూపి - మార్గమై నిలిచేగా
నా సన్నిధి తోడని రెక్కలపై మోసేనుగా
శ్రేమనోందిన ఏళ్లకొలది సమృద్ధితో నింపెనుగా

Ninu Matrame Ne Nammanaya Song Lyrics|| Latest Christian Telugu Song 2025 || Bro John J

నిను మాత్రమే

నే నమ్మానయా


నిను మాత్రమే నే నమ్మానయా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా
నీ బాహుబలమే నడిపించును
నా స్థితులన్నిటిని సరిచేయును
కృప చూపువాడవయా నీ పిల్లలకు


1. నీవు సెలవియ్యగా కలుగనిదేముంది
వాక్కును పంపగా జరుగనిదేముంది
సకలము నీదెనయా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయా
సమకూర్చువాడవయా నీ పిల్లలకు


2. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా అడ్డుపడువాడెవడు
యుద్ధము నీదెనయా ఓ శూరుడా
ముందుకు సాగెదనయా
జయమిచ్చువాడవయా నీ పిల్లలకు


3. నీవు కరుణించగా కాదనువాడెవడు
శక్తితో నింపగా ఓడించువాడెవడు
సాయము నీదెనయా సహాయకుడా
నీలో దాగెదనయా
బలమిచ్చువాడవయా నీ పిల్లలకు

Monday, May 12, 2025

Yesu Nannu Preminchinaavu Song Lyrics | Srastha | Cicily Itty & Prabhu Pammi | Telugu Christian Classic


యేసూ నన్ను

ప్రేమించినావు


యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు (2)


1. నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల

ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ||


2. తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2) ||యేసూ||


3. మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో

బెంచనెంచి ప్రేమించినావు (2)         ||యేసూ||



4. నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2)         ||యేసూ||


5. నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2)         ||యేసూ||

Adarinchavuga Song Lyrics | Manninche Prema Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Yasaswi Kondepudi | Telugu Christian Songs 2025

మన్నించే ప్రేమ - కనిపించే నీలో -


ఆదరించావుగా - నా దేవ నా యేసయా
లాలించే నీ ప్రేమ - ఉప్పొంగే నాలోన

- ఏనాటి అనుబంధమో
గుండెల్లో నీవేగా - సంతోష గానంగా

- సాగాలి కలకాలము
ఏపాటి నన్ను - ప్రేమించినావు -

తీర్చేదెలా నీ ఋణం - నీకేగా ఈ జీవితం


1. నీతో మాట - నీతో బాట - వరమే ఈ పయనం
ఆశే నీవై - ధ్యాసే నీవై - కొలిచే ఈ సమయం
ఉన్నావు తోడు నీడై నాతో - నా యేసయ్యా
దాచావు ఎన్నో మేళ్లు నాకై - నా యేసయ్యా
నీవు లేనిదే - మనలేనుగా - నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా
రక్షించే దైవంగా - విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక


2. నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం
భారం మోసి - బలమే నింపి - మలిచే నా గమనం
చుక్కాని నీవై దారే చూపే - నా యేసయ్య
అందాల లోకం నీలో చూసా - నా యేసయ్య
ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము
నా జీవితపయనంలో - బలహీన సమయంలో
ఓదార్చే దైవంగా - నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక

Varnimpalenu Vivarimpalenu Song Lyrics | Yesayya neevu naku chesina mellu song lyrics | ZION Telugu Songs | Zion Songs

వర్ణింపలేను

వివరింపలేను

వర్ణింపలేను వివరింపలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)


1. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింపను – ఋణం ఎలా తీర్చను

||యేసయ్యా||



2. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింపను – ఋణం ఎలా తీర్చను

||యేసయ్యా||


3. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింపను – ఋణం ఎలా తీర్చను

||యేసయ్యా||

Thursday, May 8, 2025

Varnimpatharama Song Lyrics | Srastha-4 | Nithya Mammen & Jonah | Telugu Christian Song 2025

వర్ణింపతరమా


వర్ణింపతరమా నిన్ను నేను యేసువా
పాడతరమా నీదు కృపను యేసువా (2)
నీ కౌగిట చేరు కొనుటకై ఆశించితి ప్రాణనాథుడ
నీ స్వరమును నిరాతం వినుటకై ఆశించితి ఆత్మనాథుడ
కృపకు మూలము నీవెగా (2)


1. సిలువను నే చూడగా నిండెను కృతజ్ఞతా (2)
కనులు నిండే భాష్పములతో నోరు నిండే స్తోత్రములతో
ఆత్మ రక్షణ నాకు సగ బలియైతివే నీ యెదుట నిలిచెదా

నా సర్వం ఇచ్చేద కరుణా సాగరా నీవెగా (2)



2. నీ వాక్కును నే చూడగా నా భాగ్యము కనుగొంటిని (2)
నీదు సుతగా శ్రేష్ట స్థితిని సంతసంబగు స్వర్గ స్థితిని
దానముగా నీ కృప వరములను పొందితి నీ ఆత్మ శక్తితో జీవింతును
సాక్షిగా మహిమ ప్రభుడవు నీవెగా (2)