Halaman

Pages - Menu

Pages

Tuesday, March 10, 2026

Deva E Jeevitham Song Lyrics || ENNI KASTALAINA SONG LYRICSII Powerful Telugu Worship Song 2026 ll PASTOR.EBENEZER PAUL II #trending


ఎన్ని కష్టాలైనా


దేవా ఈ జీవితం... నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా

నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా
నీతోనే నా జీవితం (2)
||దేవా||



1. నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
||ఎన్ని||


2. నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై
నీ వాక్యమే నను నడిపెనూ (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
||ఎన్ని||

||దేవా||

Arhatha Lekunna Preminchavu song lyrics ||NENEMAIUNNANO NEE KRUPA SONG LYRICS | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship|STHUTHI NAIVEDHYAM

నేనేమైయున్నానో నీ కృపయే



పల్లవి : అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే
అనుపల్లవి : కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే

1.లోకమునన్ను ఆకర్షింపగా - అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా - నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

2. శ్రమలు శోదనలు నన్నావరింపగా - అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు - ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

Divya thejomaya Yessaya Song Lyrics|| Nyaadhipathi neeve na yessaya song lyrics#hosannaministries 2026 New Year Official Video Song ||

న్యాయాధిపతి


దివ్యతేజోమయా యేసయ్యా
నీతి నియమాలకు నిలయమా
నినునమ్ము నీజనుల - న్యాయాధిపతి నీవై
నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతికీర్తన

1. బలవంతుడా మహాశూరుడా
పలుశోధనలలో నాతోడై
నా కుడి పార్శ్వమందుండినావు
నీ మహిమకై నీవేర్పరచిన
నీ పాత్రగా నను మార్చినీవు
నీ ఎనలేని ప్రేమను చూపితివి
నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే ఆనందం
నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే మహదానందం


2. అభిషిక్తుడా నా ప్రాణేశ్వర
నా నీడవలె నాతోనుండి
నను రక్షించి పోషించినావు
నేనెన్నడూ నాకై ఆశించని
నీ దీవెనలతో తృప్తిపరచి
నన్నీస్థితిలో నీవు నిలిపినావు
నీవే నీవే నా ప్రాణం
నాలో నీవే నీవే నా ధ్యానం


3. నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నా బాధలలో నెమ్మదినిచ్చి
గొప్ప ఆదరణ కలిగించె నాలో
మన్నైనది మన్నైపోవునని
నను జీవాత్మతో నింపినీవు
నీ రూపుగా నను మార్చినావే
నిత్యం నీతో నడుపుటకు
నీవు నాలో నాతో ఉన్నావే

Sunday, March 8, 2026

Mahaganudaa Yehova Song Lyrics||El-shaddai Song lyrics || #hosannaministries 2026 New Album Pas.John wesley || Latest Hosanna Ministries Songs

ఎల్షద్దాయ్


పల్లవి:
మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా

ప్రభుప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు

మహిమాత్ముడా త్రిత్వమై జీవించువాడవు -

కీర్తించి మహిమపరతును స్తుతించి ఆరాధింతును -

నీకే నా ఆరాధన - హల్లేలూయా -ఏల్ ఎలోహీం నీవే

- ఎల్షద్దాయ్ దేవుడవు - ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే


1. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా -

నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా -

నీవేగా విధినే చేధించి నీవు -

భువినే వెలిగించగా స్తుతినే నానోట పలికించి-

బహుగా దీవించగా గళమెత్తి కీర్తింతును ॥ హల్లేలూయా ॥

2. కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా

వేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా నీ వాక్కేగా శ్రమలే

నను వేధించిననూ కలతలే బాధించినా కృపయే

క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును ॥ హల్లేలూయా ॥

3. ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా -

నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా

నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు నీవే సమాధానప్రభువై -

ఏలే మహరాజువు - నీ కీర్తి కీర్తింతును ॥ హల్లేలూయా ||

DivyaSakhudaa Song Lyrics ॥ సఖుడా - దివ్య సఖుడా ॥ #hosannaministries 2026 New Album || Latest Christian Songs 2026

దివ్య సఖుడా

సఖుడా - దివ్య సఖుడా ప్రియుడా - ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈ నాటిది
ఏనాటికీ వీడిపోదు - విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక - పలికే గీతిక



1. మౌనరాగమే - మధురగానమై ॥2॥
మరుపురానిదై - మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే - శృతిలయలు నేర్పినాయి
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో - ఏ కాంతి లేకున్ననూ
నా పాదములు జ్ఞారక - కాపాడే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను

నిత్యము నిను కీర్తించెదను ॥ సఖుడా ॥

2. నిండు మనస్సులో - ప్రేమ దీపమై ॥2॥
మారుమనస్సుకై - సత్యమార్గమై
పలికే ప్రేమనీవై - నీవు నాతో నున్నావు
నా హృదయసీమ నేలే - మహరాజుగా నిలిచావు
నీవు నా ముందుగా - నడిచే కాపరిగా
నా చేయి వీడకా - నడిపించే యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను

నిత్యము నిను కీర్తించెదను ॥ సఖుడా ॥


3. రమ్యమైనది - భాగ్యమైనది
నిత్యమైనది - సరిపోల్చలేనిది ॥2॥
నీ మహిమ రాజ్యమందు - సీయోను శిఖరమందు
నే పరవశించి పాడే - గొప్ప భాగ్యమిచ్చినావు
నూతనమైనది - ఎవరూ పాడలేని

శ్రేష్ఠమైన గీతం - నే పాడెద యేసయ్యా
సద్గుణ రాశివి నీవేనని - స్తుతి మహిమలు చెల్లించెదను

నిత్యము నిను కీర్తించెదను ॥ సఖుడా ||

Idigo Naa Jeevitham Song Lyrics ॥ ఇదిగో నా జీవితం ॥ #hosannaministries 2026 New Album || Latest Hosanna Ministries Songs

ఇదిగో నా జీవితం


ఇదిగో నా జీవితం దేవా నీ కంకితం
బ్రతుకైనా చావైనా నీ కోసమే (2)
నాకున్నది నీ ఒక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)


1. నీవైపే నే చూడక - నీ ప్రేమే నేనెరుగక
శిధిలమైన శిలనై నేనుండగా (2)
నను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి (2)
ఎన్నాళ్ళుగ నాకై వేచి యున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (2)

|| ఇదిగో నా జీవితం ||


2. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్యా (2)
ఊహలరేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానము నిచ్చితివి (2)
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీఋణము నే తీర్చెదను (2)

|| ఇదిగో నా జీవితం ||



3. స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో మహనీయుడా

స్వరమండలము సితారతో నిను కీర్తింతును (2)

సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే (2)
దైవములనబడిన వారికి నీవే
దేవుడవు మహాదేవుడవు (2)

|| ఇదిగో నా జీవితం ||

Karuna Katakshamu Song Lyrics || కరుణాకటాక్షము | Ps Freddy Paul || Latest Hosanna ministries Songs 2026

కరుణ కటాక్షము


కరుణ కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయ
దివ్య సుందరమ - దయకు నిలయమ
దివిలో కాంతితేజమా
పరిమళ నామమ - ప్రేమకు నిలయమ
పరిశుద్ధ స్తుతి గానమా



1. ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధె క్షేమము
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు


2. నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు
నీ ఇష్టునిగా నివసించెదను
నీ ఉద్దేశము నే మరువను
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు

3. ఏ యోగ్యత లేని నాకు తోడుగ నిలిచావు
నింద అవమానములో ఘనతనిచ్చినావు
నీ నడిపింపుకు లోబడితిని
నీ స్వాస్థ్యముకై వేచియుంటిని
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు

SOUNDARYA POORNUDAA Song Lyrics ॥ Hosanna Ministries 2026 New Album || Latest Christian Songs 2026

సౌందర్యపూర్ణుడా


సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా
రమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకా (2)
యేసయ్యా నా ప్రాణస్నేహిత
మనస్సంతా నిండిన మధురాను బంధమా
అతిప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖదర్శనం

ఆ:ప:-
మనసారా నిన్నే చేరి
ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశతీరా
అతికాంక్షణీయుడా (2)


1. సద్భక్తితో బ్రతుక ఆశించగా
వాగ్ధాన ధ్వనులే బలపరచెను (2)
విశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూ
కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ
నీవే నిమ్మళపరచినావు
|| మనసారా నిన్నే చేరి ||


2. మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయ
నీ కరుణచూపి నా కొసగినావు (2)

సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి
సమీపించలేని నీ మహిమకై పిలిచిన
మహిమోన్నతుడా యేసయ్యా
|| మనసారా నిన్నే చేరి ||


3. త్వరలో రానైయున్న నా ప్రియుడవు
కను రెప్పపాటున నిను చేరెదను (2)
కనులార నిను చూసి మైమరిచిపోయే
కనువిందు చేసే మహిమానగరిలో
పరవశమే ప్రతినిత్యము

|| మనసారా నిన్నే చేరి ||

Israel kaapari song Lyrics || ఇశ్రాయేలు కాపరి ॥ #hosannaministries 2026 New Album Pas.RAMESH Anna

ఇశ్రాయేలు కాపరి


అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా
ఇశ్రాయేలు కాపరి - బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా
సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా
సత్యవంతుడా మహా పరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా


1. నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన
మా పక్షమైయున్న- మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా


2. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు
విస్తారమైన నీకృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు

విజయోత్సవముతో ఊరేగించెదవు

నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా


3. సాత్వీకముతో - దీర్ఘశాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్లక
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ రుణము వివరింప తరమా

SthuthiKeerthaneeyudaa Song Lyrics॥ స్తుతి కీర్తనీయుడా ॥ #hosannaministries 2026 New Album Pas.ABRAHAM Anna


స్తుతి కీర్తనీయుడా


స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ

నా హృదయ వీణపై శృతిచేసి పాడనా

నా యేసు రాజా అనురాగ బంధమా

నన్ను విడవలేని ఆత్మ అనుబంధమా "2"



1.నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా

నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా "2"

నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును

ఇలలోన నీకై సాక్షిగా జీవించును "2"

" నా యేసు రాజా "



2. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా

నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా "2"

నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము

ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం "2"

" నా యేసు రాజా "



3. మహిమ సింహాసనం నే చేరాలనే

నే కన్న కలలన్నీ నిజమైన వేళలో "2"

నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన

నీలోనే లీనమై పోదునే నే నిరంతరము "2"

" నా యేసు రాజా "