స్తోత్రగీతములు
పల్లవి:
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం - 2
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం -2
స్తుతియాగము అర్పించేదం
సర్వోన్నతుని సన్నుతించేదం - 2
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ -2
చరణం: 1
వంకర మార్గమును - తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను 2
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించేను - 2
ప్రేమాస్వరూపుడు - దీర్ఘశాంతుడు -2
చరణం: 2
ఘనమైన కార్యములు - జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా - నడిపించియున్నాడు -2
మనలను ఎంతో ప్రేమించెను
గొప్ప దీవెనలు కురిపించెను - 2
కరుణస్వరూపుడు - మహోపకారుడు -2
చరణం: 3
స్తుతులపై ఆసీనుడు - యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు - 2
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం - 2
ఆత్మస్వరూపుడు - ఆరాధ్యనీయుడు - 2
No comments:
Write CommentsSuggest your Song in the Comment.