NE GELICHEDANU
1. నీ నామములోనే పొందెదను రక్షణ
పాపములనుండి విమోచన
నీ శక్తితోనే, నిలిచియున్నాను
నీ ప్రేమలోనే జీవింతును
అంధులకు వెలుగునిచ్చావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధులనుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నే గెలిచెదను
జీవించెదను
నీ నీడలో
నిలిచెదను
శోధనలు
సహించెదను
నా తోడు
నీవే ఉండగ
2. నీ రూపములోనే నన్ను సృజియించితివి
నీ ఆత్మతో నన్ను నింపితివి
నీ ప్రాణమునర్పించి నన్ను రక్షించితివి
నీ సొత్తుగా నన్ను చేసితివి
అంధులకు వెలుగునిచ్చావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధులనుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నే గెలిచెదను
జీవించెదను
నీ నీడలో
నిలిచెదను
శోధనలు
సహించెదను
నా తోడు
నీవే ఉండగ.
ఆకాశముకన ఏతైనది నీ నామము
సముద్రముకన లోతైనది నీ ప్రేమ (4)
తారలకన సమృద్ధి గలది నీ కృపా
నే గెలిచెదను
జీవించెదను
నీ నీడలో
నిలిచెదను
శోధనలు
సహించెదను
నా తోడు
నీవే ఉండగ (2)
No comments:
Write CommentsSuggest your Song in the Comment.