Tolakari vaana-తొలకరి వాన
కురిసింది తొలకరి వాన
నా గుండెలోన "2"
చిరుజల్లాగా ఉపదేశమై
నీ వాక్యమే వర్షమై "2"
నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయే హెర్మోను మంచువలె "2"
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య "2"
//కురిసింది తొలకరి వాన//
1.దూలినై పాడైన ఎడారిగా నను చేయక
జీవజలఊటలు ప్రవహింపజేశావు "2"
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనియక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు "2"
స్తుతులు స్తోత్రం నీకే అయ్యా దయాసాగరా
స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య "2"
//కురిసింది తొలకరి వాన//
2. నీ మందిర గుమ్మములోని బూటలతో శుద్ధి చేసి
నాచీల మండలమునకు సౌందర్యమిచ్చితివి "2"
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నను నడిపితివి నీ "2"
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా
పొంగి పొలిగి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య "2"
//కురిసింది తొలకరి వాన//
3. నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
నా ఆశల ఊహలలో విహరింపజేశావు "2"
నా కడవరి వర్షము నీవైఫలింపజేసావు
నీ మహిమ మేఘములో ననుకొనిపోయెదవు "2"
హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర
హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర
పొంగి పొలిచి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య "2"
//కురిసింది తొలకరి వాన//
HOSANNA MINISTRIES
SONG SHEET
DOWNLOAD
No comments:
Write CommentsSuggest your Song in the Comment.