షారోను రోజావే
షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే
సుందరుడవు - నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు - బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు
అనుపల్లవి:
హోసన్నా - ఉన్నత దైవమా
హోసన్నా - దావీదు తనయుడా
1. స్నేహితులు మరచిపోయినా -
బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే
వేదనలో ఆదరించే నా ప్రియుడవే
2. రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే - పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే
No comments:
Write CommentsSuggest your Song in the Comment.