INTA KALAM | ఇంత కాలం | ANIL VEMULA | KY RATNAM | ANAND | SIRISHA | LATEST TELUGU CHRISTIAN SONG
ఇంత కాలం మీ కృపయే కారణం
ముందున్న కాలం ఆ కృపయే నా ధైర్యం //2//
జడియను వెనుదిరుగను - జారిపోను గురితప్పను
ముందుకు సాగెద - నా ప్రియ యేసుతో
॥ఇంత॥
వెనుకటి దినముల - వెనుదిరిజూడగ
వివరింపగనీ - విస్తృతకృపలను
ఎరుగని త్రోవలన్ - నడిపిన దైవమా
అలసిన వేళలో - జతకలసిన స్నేహమా //2//
ఏమనీ .... ఎన్ననీ....... //2//
లెక్కకు మించిన - నీ ఘనకార్యములు //2//
॥ఇంత॥
గడచిన కాలము - గతితప్పిన దినములు
నీ క్షేమకరముతో - నను నిలిపిన క్షణములు
వాక్యపు వెలుగులో - సరిచేసిన దైవమా
క్షమియించుటలో - ఉన్నత శిఖరమా //2//
ఎవరనీ… నేనెంతనీ …. //2//
ఊహించగలనా- నీ ప్రేమపరిధులు //2//
॥ఇంత॥
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here

