Halaman

Pages - Menu

Pages

Saturday, May 11, 2019

NAA HRUDAYANA KOLUVAINA YESAYYA - BRO.YESANNA HOSANNA MINISTRIES

        నా హృదయాన కొలువైన - యేసయ్యా 



                  



నా హృదయాన కొలువైన - యేసయ్యా 

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా 

నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే 

నీ  సన్నిధిలో పూజార్హుడా 


1.  అగ్ని ఏడంతలై - మండుచుండినను 

                                 అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను                          || 2 ||

                               అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే                        || 2 ||

నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే 

                                                   నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా                                               || 2 ||


నా హృదయాన కొలువైన - యేసయ్యా..... 


2.   అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో 

                              నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే                       || 2 || 

                  నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను          || 2 ||

నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే 

                                                   నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును                                            || 2 ||

నా హృదయాన కొలువైన - యేసయ్యా..... 


3.    విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు 

                              ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా                       || 2 ||  

                        సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే                   || 2 || 

నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే 

                                                  నా స్వరము నీకే అర్పింతును                                           || 2 ||

 

నా హృదయాన కొలువైన - యేసయ్యా 

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా 

                                         నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే                                   || 2 ||

నీ  సన్నిధిలో పూజార్హుడా

     నా హృదయాన కొలువైన - యేసయ్యా  ...... 

Tuesday, May 7, 2019

CHIRAKALA SNEHAM NEE PREMA CHARITAM॥HOSANNA MINISTRIES 2019 New Song-4 || చిరకాల స్నేహం నీప్రేమ చరితం ॥


చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం

             
                          

                        చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే                  || 2 || 

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

  చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే  


                                   1.  కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై                             || 2 || 

నేను నీకు భారమైనదూరమైన వేళలో 

నీవే నాకు చేరువై చేరదీసినావయా 

ఎంత ప్రేమ యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే  



                                     2.   గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది                               || 2 || 

సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో 

దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా 

తోడు నీవే యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే  



                                   3.  మధురమైన  ప్రేమలోన విలువకలిగె సిలువకు                        || 2 || 

శిలాగానేను నిన్ను చేర నీదురూపు కలిగెను 

శ్రేష్ఠమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా 

నిలిపినావు యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

                         చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే                  || 2 ||




Follow, Like and Share

Telegram Channel:

Facebook Page:

 

For More Songs Click Here :