Pages - Menu

Pages

Tuesday, May 7, 2019

CHIRAKALA SNEHAM NEE PREMA CHARITAM॥HOSANNA MINISTRIES 2019 New Song-4 || చిరకాల స్నేహం నీప్రేమ చరితం ॥


చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం

             
                          

                        చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే                  || 2 || 

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

  చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే  


                                   1.  కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై                             || 2 || 

నేను నీకు భారమైనదూరమైన వేళలో 

నీవే నాకు చేరువై చేరదీసినావయా 

ఎంత ప్రేమ యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే  



                                     2.   గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది                               || 2 || 

సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో 

దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా 

తోడు నీవే యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే  



                                   3.  మధురమైన  ప్రేమలోన విలువకలిగె సిలువకు                        || 2 || 

శిలాగానేను నిన్ను చేర నీదురూపు కలిగెను 

శ్రేష్ఠమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా 

నిలిపినావు యేసయ్యా 

చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే 

                         చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే                  || 2 ||




Follow, Like and Share

Telegram Channel:

Facebook Page:

 

For More Songs Click Here :

 
 
 
 
 
 

 
 








No comments:

Post a Comment

Suggest your Song in the Comment.