చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే || 2 ||
నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే

1. కలలుకన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై || 2 ||
నేను నీకు భారమైనదూరమైన వేళలో
నీవే నాకు చేరువై చేరదీసినావయా
ఎంత ప్రేమ యేసయ్యా
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే
నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే
2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది || 2 ||
సంధ్యవేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో
దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయా
తోడు నీవే యేసయ్యా
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే
నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం -చిగురించె నాకోసమే
3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు || 2 ||
శిలాగానేను నిన్ను చేర నీదురూపు కలిగెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా
నిలిపినావు యేసయ్యా
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే
నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీ ప్రేమ చరితం - చిగురించె నాకోసమే || 2 ||
Follow, Like and Share
No comments:
Write CommentsSuggest your Song in the Comment.