
స్తుతిగానమే పాడనా Song Lyrics ॥ Sthuthi ganame padana Song Lyrics ॥ Hosanna Ministries Song Lyrics live Song by Pas.John wesley Anna Songs
స్తుతిగానమే పాడనా
Stuthigaaname Padana Song Lyrics
స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||
3. నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||
నా బలమంతా నీవేనయ్యా Song Lyrics లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu యుద్దము యెహోవాదే Song Lyrics in English యెస్సయ్యా నా హృదయస్పందన Song Lyrics in Telugu స్తుతియించెదా నీ నామం Song Lyrics in Telugu నాదంటూ లొకాన ఏదిలేదయ్యా Song Lyrics in Telugu