YESAIAH NA HRUDAYASPANDANA
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
1. నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3. నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
Na Balamantha Neevenayya Song Lyrics    లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu    ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu    ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu    యుద్దము యెహోవాదే Song Lyrics in English    
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.