
Varnimpatharama Song Lyrics | Srastha-4 | Nithya Mammen & Jonah | Telugu Christian Song 2025
వర్ణింపతరమా
వర్ణింపతరమా నిన్ను నేను యేసువా
పాడతరమా నీదు కృపను యేసువా (2)
నీ కౌగిట చేరు కొనుటకై ఆశించితి ప్రాణనాథుడ
నీ స్వరమును నిరాతం వినుటకై ఆశించితి ఆత్మనాథుడ
కృపకు మూలము నీవెగా (2)
1. సిలువను నే చూడగా నిండెను కృతజ్ఞతా (2)
కనులు నిండే భాష్పములతో నోరు నిండే స్తోత్రములతో
ఆత్మ రక్షణ నాకు సగ బలియైతివే నీ యెదుట నిలిచెదా
నా సర్వం ఇచ్చేద కరుణా సాగరా నీవెగా (2)
2. నీ వాక్కును నే చూడగా నా భాగ్యము కనుగొంటిని (2)
నీదు సుతగా శ్రేష్ట స్థితిని సంతసంబగు స్వర్గ స్థితిని
దానముగా నీ కృప వరములను పొందితి నీ ఆత్మ శక్తితో జీవింతును
సాక్షిగా మహిమ ప్రభుడవు నీవెగా (2)