పల్లవి:  స్తుతి పాడుటకే బ్రతికించిన
 జీవనదాతవు నీవేనయ్యా
         ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
         తల్లివలె నన్ను ఓదార్చినా
         నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2
          జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
         నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
  1 . ప్రాణభయమును తొలగించినావు
         ప్రాకారములను స్థాపించినావు
                        సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు  -2
         నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
                        తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥
  2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
    కనుమరుగాయెను నా దుఖ:దినములు
                కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 
     నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
                   నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.  ॥ స్తుతి ॥
   3. హేతువులేకయే ప్రేమించినావు
       వేడుకగా ఇల నను మార్చినావు
       కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2
       నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై
                            నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై          ॥ స్తుతి ॥


Excellent song 🙏
ReplyDeletePraise The Lord
DeleteAmen super song
ReplyDeletePraise The Lord
DeleteHii annaiah ee song chala bagunnadhi.
ReplyDeletePraise The Lord
DeletePraise the lord
ReplyDeleteGood brother God bless you...
ReplyDelete