పల్లవి : నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి
నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడియున్నవి
ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా
ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా
యేసయ్య నిలిచాడు నీ తోడుగా
1. అలసిన నీ ఆశ ప్రభువు తీర్చగా
చెదిరిన నీ మది సరి చెయ్యగా
లోకము శోకము నీలో తీసి
నూతన క్రియలను జరిగించునుగా ॥ ఇన్నాళ్ళ ||
2. నీపై నిందను తొలగించగా
తలగా నిన్ను నియమించగా
ధూషణలన్నీ భూషణములుగా
హృదిలో చేదును మధురము చేయగా ॥ ఇన్నాళ్ళ ||
3. కలతల కడలిని దాటించగా
తరగని సమృద్ధి దయచేయుగా
పరులకు సాయము చేయగ నిన్ను
పలు విధములుగా దీవించుగా ॥ ఇన్నాళ్ళ ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.