ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడునో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును
పల్లవి: నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము
1. రోగము తలవంచును నీ నామము యెదుట
శాపము తలవంగును నీ నామము యెదుట
సాటిలేని నామము - స్వస్థపరచే నామము
2. ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత
శ్రేష్టమైన నామము - శక్తిగలిగిన నామము
Bridge: హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య
కొనియాడబడును గాక నీ నామము యేసయ్య
అన్ని నామములకు పై నామముగ
No comments:
Write CommentsSuggest your Song in the Comment.