పల్లవి: నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా
నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా
|| నా స్తుతి ||
1. నీ వాక్యమే - నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (2)
|| నా స్తుతి ||
2. నీ కృపయే - నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (2)
|| నా స్తుతి ||
3. నీ సౌందర్యము యెరుషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2)
|| నా స్తుతి ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.