
Srushti Kartha Yesu Deva Song Lyrics|| Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics
సృష్టి కర్తా యేసు దేవా
సృష్టి కర్తా యేసు దేవా
సర్వ లోకం నీ మాట వినును (2)
సర్వ లోక నాథా సకలం నీవేగా
సర్వ లోక రాజా సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము ||సృష్టి||
1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షా రసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగల బాగు పరచితివి
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||
2. మృతుల సహితము జీవింపజేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప
కొనిపోవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||