
ATHIPARISHUDUDA STHUTHI SONG LYRICS ॥ అతిపరిశుద్ధుడా ॥ Hosanna new year song 2023
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి ||అతిపరిశుద్ధుడా||
2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా||
3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి ||అతిపరిశుద్ధుడా||