
Neeve Neeve Song Lyrics| John Vittney - Neeve Deva (Feat. Allen Ganta, Queen Erusha, Bobby Joe) | Christian Worship Song | 4k
నీవే నీవే
పాపిగ నను చూడలేక పాపముగా మారినావా
దోషిగా నను చూడలేక నా శిక్ష నీవు పొందినావా (2)
నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు అవమాన మొందితివే
తండ్రితో నను చేర్చుటకు విడనాడబడితివే
జీవము నాకిచ్చుటకు మరణమునొందితివే
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
పరమును వీడి ఈ భువికి దిగివచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమామయుడా
నే వెదకి రాలేనని సత్యమునెరిగి నీవే నా దరికి పరిగెత్తితివి
దాసత్వము నుండి నను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి
ఓ... నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
నా స్థానంలో నీవే నిలచి నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్య వంతునిగా నన్నే చేసి, సొగసంత కోల్పోయితివి
నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి
ఓ... నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
నా బలమంతా నీవే నా సౌందర్యం నీవే
నా ఐశ్వర్యము నీవే, నీవే నీవే
నా అతిశయము నీవే నా ఆనందం నీవే
నా ఆధారం నీవే, నీవే నీవే (2)
యేసయ్య యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) || పాపిగ ||