
NEEKANTE Telugu Song Lyrics | నీకంటె నమ్మదగిన Telugu Song Lyrics | AR Stevenson's || Telugu Christian Popular Praise and Worship Songs
నీకంటే నమ్మదగిన దేవుడెవరయా
నీవుంటే నాతో ఏ భయము లేదయా
మేలుకొరకే అన్నీ జరిగించు యేసయ్యా
కీడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా
1. కొట్టబడినవేళ నా గాయం కట్టినావే
బాధించినా స్వస్థపరచేది నీవే
2. అణచబడినవేళ నా తలను ఎత్తినావే
శిక్షించినా గొప్ప చేసేది నీవే
3. విడువబడినవేళ నను చేరదీసినావే
కోపించినా కరుణ చూపేది నీవే