
కన్నులజారిన కన్నీళ్ళు ll KANNULA JAARINA KANNILLU SONG LYRICS ll ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU SONG 2024
కన్నులజారిన కన్నీళ్ళు
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా
1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు ||ఉందిలే ||
2. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు || ఉందిలే ||