
Mahima Swarupuda Song Lyrics || మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా Song Lyrics || Hosanna Ministries Songs
మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
1. నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను
||మహిమ స్వరూపుడా||
2.విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు
||మహిమ స్వరూపుడా||
3. పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను
||మహిమ స్వరూపుడా||