Neevunna Chota Song Lyrics| Dr.Jayasudha Kapoor | Ravi Mandadi | Symonpeter | Latest Christian Telugu Song 2024
నీవున్న చోట
పల్లవి : నీవున్న చోట నేనుండాలయ్య
నేనున్న ప్రతి చోట నీతోడుండాలయ్య (2)
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా క్షేమాధారము నీవే నా యేసయ్యా (2)
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)
1. ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు
నిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావు
నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చావు
నీ చల్లని చూపులో దీవెనలిచ్చావు (2)
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)
2. నీతోనే నడుచుటకు నన్నెంచుకున్నావు
నీ కీర్తిని చాటుటకు సాక్షిగా నిలిపావు
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
నీ శాశ్వత కృపలో నాకున్నది మేలు
మధురం నీలో జీవితం
ఆపాద మస్తకం అంకితం...అతి (2)