
Yehova Needu Mellulanu | Raj Prakash Paul Song Lyrics | Latest Telugu Christian Lyrics Song 2017 ||
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్య జీవితము నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
1. ఘనుడ సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం
ఓ .. ఘనుడ సిల్వ ధరుడా ||2||
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే మాకు భాగ్యం
ఓ .. మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
2. ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం ||2||
నా రక్షణకై పారమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ .. మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్య జీవితము నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణభూతుడా పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు
Song: Yehova Needu Mellulanu
Album: Prardhana
Written, Composed, Music & Produced by
SUBSCRIBE :