Neeve Krupadaramu Song || 2020 Hosanna Ministries New Year Song ॥ కృపాధారము - Krupadharamu ॥ 2020
NEEVE KRUPAADHAARAMU
నీవే కృపాధారము - త్రియేకదేవా
నీవేక్షేమాధారము - నా యేసయ్యా (2)
నూతన బలమును - నవ నూతన కృపను (2)
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
1. ఆనందిచితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైన నీలో నేను (2)
ఆకర్షింతివి ఆకాశము కంటే
ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
నీవే క్షేమాధారము - నా యేసయ్యా (2)
నూతన బలమును - నవ నూతన కృపను (2)
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
2. సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్త్యముకై నను పిలచితివి (2)
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనము కలిగి (2)
శిధిలము కాని సంపదలెన్నోనాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
నీవే క్షేమాధారము - నా యేసయ్యా (2)
నూతన బలమును - నవ నూతన కృపను (2)
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
౩. ప్రాకారములను దాటించితివి
ప్రార్ధన వినెడి పావన మూర్తి (2)
పరిశుద్ధులతో నను నిలిపితివి
నీ కార్యములను నూతనపరచి (2)
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో చేర్చుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్తిరపరచినావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
నీవే క్షేమాధారము - నా యేసయ్యా (2)
నూతన బలమును - నవ నూతన కృపను (2)
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా