NAA HRUDAYANA KOLUVAINA YESAYYA - BRO.YESANNA HOSANNA MINISTRIES
నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే
నీ సన్నిధిలో పూజార్హుడా
1. అగ్ని ఏడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను || 2 ||
అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే || 2 ||
నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా || 2 ||
నా హృదయాన కొలువైన - యేసయ్యా.....
2. అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే || 2 ||
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను || 2 ||
నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును || 2 ||
నా హృదయాన కొలువైన - యేసయ్యా.....
3. విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా || 2 ||
సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే || 2 ||
నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
నా స్వరము నీకే అర్పింతును || 2 ||
నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే || 2 ||
నీ సన్నిధిలో పూజార్హుడా
నా హృదయాన కొలువైన - యేసయ్యా ......