Balavanthudavu Naa yesayya || బలవంతుడవు | JOHN PRADEEP | ABHINAV MANAPATI | KAVYA PENMETSHA
Balavanthudavu Naa yesayya || బలవంతుడవు | JOHN PRADEEP | ABHINAV MANAPATI | KAVYA PENMETSHA
బలవంతుడవు నా యేసయ్యా
నేనొక బాణము నీ చేతిలో (2)
సైన్యములకు అధిపతివి నా యేసయ్యా
విజయానికి చిహ్నము నీవేనయ్యా
సర్వమును సృజియించిన సర్వోన్నతుడా
చీకటినుండి రక్షింప దిగివచ్చావా
నీవు విల్లు ఎత్తగా అపవాది గుండెలో — భయము పుట్టెనయ్యా
నీవు విల్లు ఎత్తగా అంధకార శక్తులు — నేల కూలెనయ్యా (2)
నీ కౌగిటిలోనే నివసించగా
శత్రువు నీడ నన్ను తాకుట సాధ్యమా (2)
నీ రెక్కలతో నను దాచగా
అపవాది బాణములు లయమయెను
నీ రుధిరమే నను తాకగా
జీవపు సెలయేటితో నను నింపెను
నీవు విల్లు ఎత్తగా అపవాది గుండెలో — భయము పుట్టెనయ్యా
నీవు విల్లు ఎత్తగా అంధకార శక్తులు — నేల కూలెనయ్యా (2)
నీ చేతిలో నేను ఉండగా
గురి తప్పక గమ్యము చేరెదను (2)
నీ నామమును నే పలుకగా
శత్రువే భయముతో చెల్లాచెదురయెను
నీ సేవలోనే కొనసాగగా
ఏ ఆయుధము నా దరి చేరదు
నీవు విల్లు ఎత్తగా అపవాది గుండెలో — భయము పుట్టెనయ్యా
నీవు విల్లు ఎత్తగా అంధకార శక్తులు — నేల కూలెనయ్యా (2)
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here