Sashwatha Krupanu Song Lyrics || శాశ్వత కృపనను Song Lyrics || నా హృదయమెంతో జీవము Song Lyrics || Naa Hrudayamentho Song Lyrics || Pas.John Wesley || Hosanna Ministries Songs
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||
నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||
భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||
సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||
నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత