కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజు యేసుని మదిలో నిలుపుమా  || 2 ||
విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును || 2 ||
 1. రాతిరంతా ఏడుపొచ్చిన కంటనీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా వెలుగు నీకు కలుగకుండునా 
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా పేరుపెట్టి నిన్ను పిలిచిన
నీ చేయి పట్టి విడచునా అనాధిగా నిన్ను చేయునా     || విడువడు నిన్ను ||
  || కన్నీళ్లతో పగిలిన ||
 2.  అంధకారం అడ్డువచ్చినా సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
భాధకలుగు దేశమందునా బంధకాలు వూడకుండునా
శత్రువెంతో పగతో రగిలిన గిన్నె నిండి పొర్లకుండునా     || విడువాడు నిన్ను ||
        || కన్నీళ్లతో పగిలిన ||
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.