ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును 
ఏ నామములో పాపమంతా క్షమించబడునో
ఆ నామమునే పూజింతును 
ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో 
ఆ నామమునే నమ్మెదను 
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో 
ఆ నామమునే స్మరింతును
పల్లవి:   నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను 
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము
1. రోగము తలవంచును నీ నామము యెదుట 
శాపము తలవంగును నీ నామము యెదుట
సాటిలేని నామము - స్వస్థపరచే నామము
2. ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట 
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత 
శ్రేష్టమైన నామము - శక్తిగలిగిన నామము
Bridge:   హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య 
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య 
కొనియాడబడును గాక నీ నామము యేసయ్య 
అన్ని నామములకు పై నామముగ 
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.