పల్లవి :పాడవే కోయిల- సుమధుర సువార్త గీతికా (2)
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా..  హల్లెలూయా స్తోత్రమని (2)
                                              || పాడవే కోయిల||
1. మహిమతో వెలిగేటి మహారాజు -నాకై మహిమ వీడి వచ్చాడని
సర్వము నేలేటి రారాజు -నాకై నిరుపేద ఐనాడని (2)
మా పాప భారాన్ని యేసే మోసాడని -ఆ ప్రేమ కిలలోన ఏది సాటి రాదని
పాడవే..  పాడవే..  పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా..  హల్లెలూయా స్తోత్రమని (2)
                                              || పాడవే కోయిల ||
2. మిడి మిడి జ్ఞానంతో మానవులు -చీకటి దారులను వెతికేరని
అంత తెలుసన్న మోసములో -అర్థములేని బ్రతుకు గడిపేరని  (2)
యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని
ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని
పాడవే..  పాడవే..  పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా..  హల్లెలూయా స్తోత్రమని (2)
                                              || పాడవే కోయిల ||
 
 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.