
Animation Movies
Monday, December 6, 2021

పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2)
అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - (తన చిత్తమునకు తల వంచితే)- (2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2)
5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)
Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew
Music: Pranam Kamlakhar
Sunday, October 17, 2021

Samayamu Poniyaka | సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా Song Lyrics | Susanna Esther | Jonah Samuel | Samy Pachigalla | LATEST TELUGU CHRISTIAN SONGS
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2)
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
1. కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
2. యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2)
Thursday, September 2, 2021

Oohakandani Upakaaramulu Song Lyrics || ఊహకందని Telugu Song Lyrics🎵 | Joshua Shaik, JK Christopher, Sharon Sisters | LATEST NEW TELUGU CHRISTIAN SONG 2021
ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు
యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా
1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ
నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును
యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా
ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు
2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును
నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును
యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా
ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు
3. గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు
ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును
యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా
ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు
Saturday, August 28, 2021

Neevu Lekapothe Na Brathuke Ledayya Song Lyrics || నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా Song Lyrics || Thandri Sannidhi Ministries New Songs || Shalem Raju Anna Songs || Vol-11 || 2020
పల్లవి: నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా
అప. యేసయ్యా.... యేసయ్యా....
1. సిరి సంపదలు కలిగిన వేళ - అందరూ హత్తుకు వుంటారు
సంపదలన్ని తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు
ఎవరున్నా... ఆ .... లేకున్నా.... ఆ .......
ఏ స్థితిలో నేనున్నా - నన్ను విడువని నమ్మకస్థుడవు నీవే
యేసయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
2. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు?
విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు
దీనులను... హీనులను
జ్ఞానులుగా.... శ్రీమంతులుగా - మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా
అప. యేసయ్యా.... యేసయ్యా....
Thursday, August 26, 2021

Saswathamainadi Neevu Naa Yada - శాశ్వతమైనది నీవు నా యెడ by Bro.Yesanna || Hosanna Ministries
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
1.నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
||శాశ్వతమైనది||
2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప
Monday, August 2, 2021

Hrudayamanedu Talupu nodda || హృదయమనెడు తలుపు నొద్ద || Andhra kraistava keerthanalu || Sri Pulipaka Jagannadham
Written by: #PulipakaJagannadham garu
Voice over: Sri. Acharya RRK Murthy garu
Credits to: original composers
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)
||హృదయ||
పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)
||హృదయ||
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)
||హృదయ||
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)
||హృదయ||
అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)
||హృదయ||
జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)
||హృదయ||
సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)
||హృదయ||
చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)
||హృదయ||
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)
||హృదయ||
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)
||హృదయ||
Sunday, August 1, 2021

Telugu Christian Podcast || తెలుగు క్రైస్తవ అంకాత్మక శ్రవ్య శ్రేణి || By Suresh Vanguri || 2021
సురేశ్ వంగూరి: ఒక చిన్న ప్రయోగం దేవుడు ఇచ్చిన తలంపు, చాలా సంవత్సరాలుగా దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఈ అప్ప్. దేవుడి సత్యాన్ని సరళీకృతం చేయబడి అందరికీ అర్దం అయ్యేలాగా రోజు వ్యక్త పరచాలని ఒక ప్రయత్నం. ప్రతి విశ్వాసిని దృష్టిలో పెట్టుకొని కొంత సత్యమైన క్రైస్తవ పునాది మరియు మౌలిక సత్యాలు ప్రతిరోజు నేర్చుకోవాలని ఒక ప్రయత్నం. ఒక అధ్యాత్మికమైన బోధన ఈ App ద్వారా చేరవేయాలని నా ప్రయత్నం.
1. App Installation: గూగుల్ ప్లేస్టోర్ కి వెళ్ళి
2. Jeevitham Podcast By Suresh Vanguri అని టైప్ చేయండి.
3. జీవితం చిహ్నం మీకు కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసినట్లైతే ఇంస్టాల్ అని కనబడుతుంది.
4. మీ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ అవుతుంది.
5. రోజు ఒక భక్తిపరమైన ఆలోచనని మీరు వెంబడించవచ్చు.
Picture from flaticon
Subscribe to:
Posts (Atom)