ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
1. యేసునినామం ఉచ్చరింపగనే
సాతాను సైన్యము వణుకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే || రక్తమే ||
2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం || రక్తమే ||
3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే || రక్తమే ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.