
Mukadarsanam Chalaya Song Lyrics| Ps. Suresh | Ps. Jnanaih | Latest Christian Song | Glorious Ministries
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
1.అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
2.పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
3.కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||