
Nanna Song Lyrics | Badhale bandinchina song lyrics | Latest christian telugu songs 2024 | Kanthi Kala song Lyrics
బాధలే బంధించినా - లోకమే ముంచేసినా
ఏదైనాగానీ ఏమైనారానీ నీ సేవలోనే
నను సాగనీ నను సాగనీ
ఎదురీతలైనా ఎదకోతలైనా నీ వైపే చూస్తూ
అడుగేయనీ అడుగేయనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నీవైపే పరుగెత్తనీ
బలహీన సమయములో బలమొందనీ
బలమిచ్చే నిను జూస్తూ పరుగెత్తనీ
"అడుగులు తడబడుతూ ఉన్నా
ఆశలు నీరవుతూ ఉన్నా
ఓటమి చేరువుగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న" /2/
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన, మాటలకందని
భాషే నాన్న}
1. నా దారిలో అనుకోకుండా ముళ్ళెదురైనా
ఊహించని సంగతులెన్నో కళ్ళెదుటున్నా /2/
ఆశించిన ఫలితం నాకు అందనిదైనా
ఆనందమే దరిదాపుల్లో కనబడకున్నా /2/
"శోధన బాధలు ఎన్నైనా
ఆకలి దప్పులు ఎదురైనా
ఓటమి చేరువగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న" /2/
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన మాటలకందని
భాషే నాన్న}
2. నీ నామము కొరకై నన్ను దూషిస్తున్నా
నమ్మికనే వదలాలంటు వేధిస్తున్నా /2/
నిందలు అవమానాలెన్నో దరినే ఉన్నా
నిమ్మళ్ళమగు బతుకే నాకు దూరం అయినా /2/
నీ ప్రియ దాసిని నేనంటూ
విశ్వాసమె ఆయుధమంటూ
నా ప్రభు సన్నిధి చాలంటూ
ఓరిమితో సాగేద నాన్న /2/
"అడుగులు తడబడుుతూ ఉన్నా
ఆశలు నీరవుతూ ఉన్నా
ఓటమి చేరువగా ఉన్నా
ఓరిమితో నడుపుము నాన్న"
మదిలో గాయములెన్నున్నా
మమతలు మాయం అవుతున్నా
మనుగడ భారముగా ఉన్నా
మౌనముగా సాగెద నాన్న , మౌనముగా సాగెద నాన్న ...
{నా పాటకు ప్రాణం, మాటకు మూలం
నువ్వే నాన్నా...
నా గుండెను తాకిన మాటలకందని భాషే నాన్న}