
Neeve neeve na kshemamu song lyrics| emichi ni runamu song lyrics|JOSHUA GOTIKALA song lyrics| telugu christian songs latest 2024 new year song
నీవే నీవే నా క్షేమము
పల్లవి.. నీవే నా క్షేమము నీవె నా ధైర్యము
నీవే ఆధారము నీవే నా సర్వము
నీతోనే జీవించాలని యేసయ్యా
నీలోనే ఫలియించాలనీ
1. అడుగడుగున అవమానాలే పలకరించినా
మరణఛాయలే నన్ను కృంగదీసినా
నాలోని ధైర్యమంత నన్ను విడచినా
నిరాశ మేఘాలే నన్ను క్రమ్మినా
విడువలేదు నీ ప్రేమ ఏసయ్యా
మరువలేదు నీ పేమ మెసయ్యా
నీ బాహు బలమే నాకు చాలయ్యా
నీలోనే ఫలియించెదను మెసయ్యా
మారనే మారదయ్యా నీ ప్రేమ
విడువనే విడనదయ్యా నీ ప్రేమ
2. కష్టకాలమందున కన్నతండ్రివైనావు
దుఃఖ సమయమందున నీ కృప లో దాచావు
బలహీన సమయమున నీ బలము చూపావు
నేనున్న నీతోనే కలతచెందకన్నావు
కంటిరెప్ప వేయకుండా ఏసయ్యా
చంటిపాపలా నన్ను కాచావయ్యా
నేనంటే ఇంత ఇష్టము ఎందుకయా
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా
మారనే మారదయ్యా నీ కృప
విడువనే విడువదయ్యా నీ కృప
3. శత్రవుల శాపాలే ఆశీర్వారాలుగా
నిందలన్ని ఘనతగా మార్చినావయా
నిన్న నమ్మినవారిని నీవు సిగ్గుపడనియ్యవని
నన్ను నీ సాక్షి గా నిలబెట్టుకున్నావు
నా పక్షమున నీవుండగ యేసయ్యా
నీ నుండి యెడబాపే వాడెవడయ్యా
ప్రాణమైన విడుతునయ్యా యేసయ్యా
నీ పాదం విడువనయ్యా మెస్సయ్యా