
Vartha Suvartha Song Lyrics || New Telugu Gospel Song || Vagdevi || Hosanna Ministries
వార్తా సువార్తా శుభవార్తా సువార్తా సిలువను గూర్చిన వార్త - శ్రీ యేసుని గూర్చిన వార్త ||2||
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
జయం సిలువలో కార్చిన రక్తం జయం
యేసు రక్తమే జయం (2)
రక్తం జయం యేసు రక్తం జయం.. (2)
1.పాపమును కడిగే రక్తం
మనసాక్షిని శుద్ధి చేసి రక్తం
శిక్షను తప్పించే రక్తం
అమూల్యమైన యేసు రక్తం...
॥ రక్తం జయం॥
2. పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం
నిష్కళంకమైన యేసు రక్తం...
॥ రక్తం జయం॥
3.నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషునిగా మార్చిన రక్తం
నిత్య నిబంధన చేసిన రక్తం
నిత్య జీవమిచ్చు యేసురక్తం...
॥ రక్తం జయం॥
4.క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం
నన్ను విమోచించిన రక్తం
క్రొత్త నిబంధన యేసు రక్తం....
॥ రక్తం జయం॥
రక్తం జయం యేసు రక్తం జయం
రక్తం జయం యేసు రక్తం జయం
నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు- అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
1. యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
॥ నా హృదయములో ॥
2.నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా
ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా
॥ నా హృదయములో ॥
3.స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగనిఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
॥ నా హృదయములో॥
నన్ను కొనిపోవ రానై యున్నా నా ప్రాణప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
॥ గగనము చీల్చుకొని||
1. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును...
॥ గగనము చీల్చుకొని||
2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది
కళంకములేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను
యుగయుగాలు నీతో ఏలేదను
||గగనము చీల్చుకొని||
3.నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యము ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో
సీయోనులో నీతో నేనుందును...
॥గగనము చీల్చుకొని||
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.
జీవన యాత్రలో అండగ నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలీ హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ ఏమని పొగడెదను
1.శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృప నీయ్యవా
కోవెలలో నీ కానుక నేనై
కోరికలో నీ వేడుక నీవై
జత కలసి నిలిచి జీవింపదలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగఫలితం నీ ప్రేమమధురం
నా సొంతమే యేసయ్య
|| జీవప్రధాతవు ||
2.నేనేమైయున్న నీ కృప కాదా
నాతో నీ సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించినాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్యా
|| జీవప్రధాతవు ||
3.మహిమను ధరించిన
యోధులతో కలసి
దిగివచ్చెదవు నా కోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు
విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో ఆరాధించెను
అభిషక్తుడవు నీవని
ఏనాడూ పొందని ఆత్మాభిషేకముతో
నింపుము నా యేసయ్య
|| జీవప్రధాతవు ||