
Oo Manishi Oho Manishi Song 2020 || by I FOR GOD VIJAY PRASAD REDDY || COVID-19 || ఓ మనిషి.. ఓహో మనిషి
Oo Manishi Oho Manishi
ఓ మనిషి.. ఓహో మనిషి
మన చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా
ఓ మనిషి..ఓహో మనిషి
మన హృదయం బాగుండుంటే ఈ ముఖమును కప్పేదుందా
నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా?
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా?
స్వార్థము నిలువునా నిండి ప్రకృతి పాడు చేసామా?
కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తూన్నామా?
ఓ మనిషి..ఓహో మనిషి
మన చేతలుబాగుండుంటే?మన హృదయం
బాగుండుంటే?ఈ చేతులు కడిగేదుందా?ఈ ముఖమును కప్పేదుందా?
1. మనిషిని ప్రేమించి దేవుడు సృష్టిని చేసాడు... మనిషిని ఏలిక చేసాడు.(2)
మనసున గర్వించి మనిషి మార్పులు చేసాడు.. ప్రకృతి వికృతి చేసాడు.(2)
గాలి కాలుష్యం నీరు కాలుష్యం భూమి కాలుష్యం ఏమైంది.
తిండి కాలుష్యం మందు కాలుష్యం చాలా ఆలస్యం అయ్యింది.
పొలము కాలుష్యం ఫలము కాలుష్యం బ్రతుకు పెడదారి పట్టింది.
మనిషి కాలుష్యం మనసు కాలుష్యం ప్రేమ చల్లారిపోయింది.
ఓ మనిషి..ఓహో మనిషి మన నడవడి బాగుండుంటే ఈ విపత్తు వచ్చేదుందా?
ఓ మనిషి..ఓహో మనిషి మన ఆశకు హద్దులు ఉంటే ఇంట్లో బంధీలయ్యేదుందా?
2. ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు ప్రాణము కొనగలడా ఇప్పుడు.(2)
ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు క్రిములకు భయపడుతున్నాడు.(2)
ఆస్తి ఎంతున్నా కీర్తి ఎంతున్నా పదవి ఏదైనా ఏముంది?
మరణసమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది.
ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అణిచింది.
సాటి మనుషులకు సాయపడమంటూ దైవనియమాన్ని నేర్పింది.
ఓ మనిషి..ఓహో మనిషి ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్తు బాగుండదా?
ఓ మనిషి..ఓహో మనిషి మన తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా?
ప్రళయజలల్లో మునగక ముందే ఓడలు చేద్దామా? అగ్ని జ్వాలల్లో కాలకముందే ఆలోచిద్దామా?
స్వార్థం కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా?
ప్రకృతి ఒడిలో దైవం నీడలో ఆనందిద్దామా?
ఓ..మనిషి ఓహో మనిషి
మన చేతలు బాగుండాలి
మన హృదయం బాగుండాలి సాటి మనుషిని ప్రేమించాలి ఆ దైవం కరుణిచాలి
ఈ పాట విన్నటువంటి ప్రియులైన సహోదరీ సహోదరులందరికీ మా ధన్యవాదములు..ఈ లాక్
డౌన్ సమయంలో సత్య సంబంధ మైన ఈ పాట అనేకులకు మేలుకొలుపుగా ఉండాలి గనుక మీకు
ఇష్టమైతే తప్పకుండా ఈ పాట యుట్యూబ్ లింక్ కాపీ చేసి మీ వాట్సప్ , Facebook
గ్రూపుల్లో Share చేసి అనేకులను వెలిగించగలరని ఆశిస్తున్నాము..