
Andhakaara Cherasalalo | Hadlee Xavier | Joel Kodali || 2020
ANDHAKAARA CHERASALALO
అంధకార చెరసాలలో
బంధకాల ఇరుకులో
పౌలు సీలలు ప్రార్ధించిరి
కీర్తనలు పాడిరి
భూమియే కంపించెను
చెరసాల అదిరెను
వారి సంకెళ్లు ఊడిపోయెను
విడుదల దొరికెను
1. వ్యాధులు ఆవరించగా
మరణము తరుముచుండగా
రండి పారి పొదుము
ఇంక దాగి యుందుము
ఏ తెగులు దరిచేరని
ఏ దిగులు ఉండని
మన దాగుస్థలములో
యేసుని సన్నిధిలో
2.ప్రార్ధన చేసేదము
దేవుని సముఖములో
ఈ శోధన సమయములో
విరిగిన హృదయముతో
ఈ లోక రక్షణకై
జనముల స్వస్థతకై
యేసుని వేడెదము
శోకము తొలగించమని
3. మొరలను ఆలకించును
యేసు మనలను విడిపించును
ఈ లోకమును శుద్ధిచేయును
మరణమును తప్పించును
మన రక్షణ వలయముగా
తన రెక్కలు చాపును
దుఃఖమును సంతోషముగా
మార్చివేయును త్వరలో
Singer: Hadlee Xavier
Written and Composed by: Joel Kodali Na Brathuku Dinamulu
Music composed and arranged by: Hadlee Xavier
Mix and Master: Hadlee Xavier
D.O.P and Editing: John Enosh