
Hrudayam Loniki Song Lyrics |Latest Telugu Christian Song 2022| Amy Ananya | JK Christopher | Suresh Vanguri| 4K
హృదయం లోనికి తొంగి చూసి
నిను నీవే మరి నిలదీసి
ప్రశ్నించుకో విమర్శించుకో
వాక్యంతో సరిచూసుకో
వినయంతో సరిచేసుకో
1. మేలేదో తెలిసి చేయలేని వైనం
కడు మోసం నా పాడు హృదయం
చేయరాదని తెలిసి చేస్తూనే ఉన్నా
అయ్యయ్యో నా రోత నైజం
క్షమియించుమా కరుణించుమా
2. మరణకరపు దేహం మరులు కొలుపు మనసూ
దినదినమూ పోరాటమేగా
కోరలు సాచాయి కోర్కెల సర్పాలు
శోధనతో చెలగాటమేగా
బలమీయమా బ్రతికించవా