
El Shama Song Lyrics | God Hears | Jessy Paul | Raj Prakash Paul |Latest Telugu Christian Song
ఎల్ షమా
దేవా చెవియొగ్గుము - దృష్టించుము -
నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము - బదులియుము -
నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)
ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ
1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము (2)
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువా